Crime News: హైదరాబాద్‌లో బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం - telugu news cyber crime in the name of bit coin trading
close
Published : 23/09/2021 22:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime News: హైదరాబాద్‌లో బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ పేరుతో భారీ మోసం

హైదరాబాద్‌: పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్న బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు సైబర్‌ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ సైబర్‌ నేరగాళ్లు విజృంభిస్తూనే ఉన్నారు. తాజాగా బిట్‌ కాయిన్‌ ట్రేడింగ్‌ పేరుతో హైదరాబాద్‌లో సైబర్‌ నేరగాళ్లు మరో భారీ మోసానికి పాల్పడ్డారు. నగరంలోని హబ్సిగూడకు చెందిన వెంకట్ అనే వ్యక్తిని ట్రాప్‌ చేసి కాయిన్‌ యూఎఫ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించారు. విడతల వారీగా బాధితుడి నుంచి రూ.12 లక్షలు పెట్టుబడి పెట్టించారు. అనంతరం యాప్‌ను డిలీట్‌ చేశారు. ఇలా మూడు రోజుల్లో ముగ్గురిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు.. దాదాపు రూ.60 లక్షలు కాజేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు వెంటనే సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని