Ts news: జూనియర్‌ కళాశాలలుగా 36 కస్తూర్బా విద్యాలయాలు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు - telugu news kgbv to turn into junior colleges in telangana
close
Published : 21/09/2021 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ts news: జూనియర్‌ కళాశాలలుగా 36 కస్తూర్బా విద్యాలయాలు.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు

హైదరాబాద్: తెలంగాణలోని 36 కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీ) ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యాబోధన కూడా జరగనుంది. ఈ మేరకు రాష్ట్రంలోని 36 కేజీబీవీలను జూనియర్ కళాశాలలుగా స్థాయి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యాలయాల్లో 2021-22 నుంచి 11వ తరగతి, 2022-23 నుంచి 12వ తరగతి ప్రారంభం కానున్నాయి. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన జరగనుంది.

ఆదిలాబాద్ అర్బన్, భీంపూర్, భద్రాచాలం, టేకుమట్ల, బీబీపేట, రఘునాథపాలెం, చింతలమానెపల్లి, కెరమెరి, రెబ్బెన, సిర్పూర్-యూ, గంగారం, జైపూర్, పెంట్లవెల్లి, శెట్టిపాలెం, కృష్ణ, నర్సాపూర్-జీ, అంతర్గాం, సిరిసిల్ల, మద్దిరాల, అమరచింత, ఐనవోలు, అడ్డగూడురులోని కేజీబీవీల్లో 40 సీట్ల చొప్పున ఎంపీసీ, బైపీసీ కోర్సులు ప్రారంభం కానున్నాయి. అలాగే బూర్గంపహాడ్, పల్మెల, భూపాలపల్లి, మహాముత్తారం, మెుగుళ్లపల్లి, రేగొండ, సిర్పూర్-టీ, మాణిక్యాపూర్, గండీఢ్‌, మహమ్మదాబాద్, ములుగు, తాడ్వాయి, మహేశ్వరం, కొందుర్గు, సిద్దిపేట అర్బన్ లోని కస్తూర్బా విద్యాలయాల్లో సీఈసీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులు ప్రారంభం అవుతాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని