TS News: ఇంధన, గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కోదండరామ్ దీక్ష - telugu news kodandaram comments on petrol prices
close
Updated : 29/07/2021 12:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS News: ఇంధన, గ్యాస్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కోదండరామ్ దీక్ష

హైదరాబాద్‌: తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ సత్యగ్రహ దీక్షకు దిగారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. కోదండరామ్‌తో పాటు పలువురు ఆ పార్టీ నేతలు సత్యాగ్రహ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా కోదండరామ్‌ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక రంగానికి ప్రధాన వనరు ఇంధనం అని.. దాన్ని ప్రభుత్వం చౌకగా ఇవ్వలేకపోతే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడలేము అని చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ఆధారంగా రూ.50 పెట్రోల్‌ ఇవ్వొచ్చని కోదండరాం చెప్పారు. ఈ ధరకు పెట్రోల్‌ ఇవ్వడం సాధ్యమే అని.. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని