Bigg Boss Telugu 5: ఎలిమినేట్‌‌ అయిన లహరి .. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..? - telugu news lahari eliminate from bigg boss house
close
Published : 27/09/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: ఎలిమినేట్‌‌ అయిన లహరి .. ఒక్కొక్కరి గురించి ఏం చెప్పిందంటే..?

హైదరాబాద్‌: బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ నుంచి లహరి (Lahari) ఎలిమినేట్‌ అయింది. ఓటింగ్‌లో ఆమెకు తక్కువ ఓట్లు పడటంతో ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఈ వారం నామినేషన్స్‌ సందర్భంగా ప్రియ vs లహరి, రవిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రియ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ప్రియ వ్యాఖ్యల పట్ల ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే, నామినేషన్స్‌లో ఉన్న వాళ్లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్న ఆసక్తి చివరి వరకూ కొనసాగింది.

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక, శ్రీరామ్‌ ఎలిమినేషన్‌ నుంచి బయటపడగా, ఇక ఆదివారం తొలుత మానస్‌ సేఫ్‌ అయ్యాడు. దీంతో ప్రియ-లహరిల మధ్య నువ్వా-నేనా అన్న రీతిలో పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తక్కువ ఓట్లు వచ్చిన లహరి ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. అది వినగానే హౌస్‌మేట్స్‌తో పాటు, ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంటి సభ్యులు లహరిని ఓదార్చే ప్రయత్నం చేయగా, ‘ఇట్స్‌ఓకే’ అంటూ సమాధానపరుచుకునేందుకు ప్రయత్నించింది. లివింగ్‌రూమ్‌లో నుంచి బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన లహరి.. శ్వేత వర్మను పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. ఆ తర్వాత ఇంటి సభ్యులందరూ ఆమెకు వీడ్కోలు పలికారు. వేదికపైకి రాగానే, లహరి బిగ్‌బాస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి గురైంది. ఈ సందర్భంగా హౌస్‌లో ఫెయిల్‌ అయిన ఐదుగురి గురించి చెప్పమంటే, అందరి గురించి చెబుతానంటూ ఇలా చెప్పుకొచ్చింది.

సిరి: చాలా మంచిది. అమ్మాయిలంటే ఇన్‌సెక్యురిటీ!

అనీ: స్వీట్‌ మామ్‌. మీతో ఇంకొంత కాలం ప్రయాణం చేయాలి.

రవి: కెమెరాలున్నాయి జాగ్రత్త!

ప్రియ: సందర్భానుసారం మన మధ్య గొడవ జరిగింది. మీపై కొంచెం కూడా ప్రేమ తగ్గలేదు.

శ్రీరామ్‌: చాలా సూపర్‌. నీ గురించి నువ్వు ఆలోచించు.

విశ్వ: స్ట్రాంగ్‌గా ఉండు.

లోబో: నీ ఈక్వెషన్స్‌ మారిపోయాయి లోబో! మనం అనుకునేవీ ఏవీ జరగవు. జనాలు వేరే అనుకుంటున్నారు.

నటరాజ్‌ మాస్టర్‌: నిజంగా బోళా శంకరుడు! ఆయనకు ఏమీ తెలియదు.

శ్వేత వర్మ: చాలా ధైర్యంగా ఉండు. నేను లేనని భయపడవద్దు!

కాజల్‌: కెమెరాలున్నాయి జాగ్రత్తగా ఉండు. మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించు.

షణ్ముఖ్‌: చిన్న నిర్ణయాలు పెద్ద తప్పులకు దారి తీస్తాయి. ఏ నిర్ణ్రయం తీసుకున్నా ఆలోచించు. సిరి నామినేట్‌ చేసిందని నన్ను నామినేట్‌ చేశావు. (వెంటనే షణ్ముఖ్ కల్పించుకుని, అందరూ ఇలాగే అంటున్నారు. నువ్వు కూడా అలా అనడం తప్పు. అందుకే నువ్వు బయట ఉన్నావు అంటూ అసహనం వ్యక్తం చేశాడు.)

జెస్సీ: చిన్న పిల్లాడు. ఏమీ తెలియదు.

సన్నీ: అన్నీ తెలుసనుకుంటాడు. ఇంట్లో వాళ్ల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాడు. చాలా షార్ప్‌ అనుకుంటాడు. అంతేమీ కాదు.

మానస్‌: పెద్దగా ఏమీ తెలుసుకోలేకపోయా. ఈలోపే బయటకు వచ్చేశా!

ప్రియాంక: ప్రియాంక ఒక స్ఫూర్తి! ఆమెలా నిర్ణయాలు తీసుకుంటే జీవితంలో చాలా ఎత్తులో ఉంటా.

హమీదా: సూపర్‌ స్ట్రాంగ్‌ లేడీ. ఎలా ఉన్నావో అలాగే ఉండు!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని