MohanBabu: ‘ఆలీతో సరదాగా’లో మోహన్‌ బాబు సందడి - telugu news mohan babu in alitho saradaga show promo
close
Published : 21/09/2021 17:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MohanBabu: ‘ఆలీతో సరదాగా’లో మోహన్‌ బాబు సందడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమం ‘ఆలీతో సరదాగా’. సినీ ప్రముఖుల ఇంటర్వ్యూతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించే ఈ షో 250వ ఎపిసోడ్‌కి చేరుకుంది. ఎంతో ప్రత్యేకమైన ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ నటుడు మోహన్‌బాబు సందడి చేయనున్నారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ‘విలన్‌గా 400కిపైగా చిత్రాలు, హీరోగా 150కిపైగా చిత్రాలు, నిర్మాతగా 60కిపైగా చిత్రాలు, విద్యావేత్తగా కీర్తి ప్రతిష్ఠలు, రాజకీయవేత్త, టాలీవుడ్‌ కలెక్షన్‌ కింగ్‌’ అంటూ మోహన్‌ బాబు ఎంట్రీని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది. ‘‘ఆలీతో సరదాగా’.. అతి త్వరలో .. ఈటీవీలో’ అని మోహన్‌ బాబు తనదైన శైలిలో చెప్పి, విశేషంగా అలరిస్తున్నారు. మరి ఆయన పంచుకున్న ఆ సరదా సంగతులేంటో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి...




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని