NTR: ఎమ్మార్వో కార్యాలయంలో తారక్‌.. ఫొటోలు దిగిన ఉద్యోగులు - telugu news ntr visits shankarpalli mro office
close
Published : 31/07/2021 11:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

NTR: ఎమ్మార్వో కార్యాలయంలో తారక్‌.. ఫొటోలు దిగిన ఉద్యోగులు

హైదరాబాద్‌: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ షూట్‌తో ఫుల్‌ బిజీగా ఉన్న తారక్‌ తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో సందడి చేశారు. ఆయన రాక పట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. శంకర్‌పల్లి మండలం పరిధిలోని గోపాలపురంలో తారక్‌ ఇటీవల ఆరున్నర ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఆ భూమి రిజిస్ట్రేషన్‌ పనుల నిమిత్తం ఆయన శుక్రవారం మధ్యాహ్నం శంకర్‌పల్లి ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చారు. ఎన్టీఆర్‌ రాకతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయంలోని ఉద్యోగులు ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి కనబరిచారు. రిజిస్ట్రేషన్‌ పనులు పూర్తైన వెంటనే కొంతమందితో ఫొటోలు దిగిన ఆయన హైదరాబాద్‌కు పయనమయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో తారక్‌ కొమురంభీమ్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా పూర్తైన వెంటనే ఆయన కొరటాల శివతో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు, ‘అరవింద సమేత’ తర్వాత తారక్‌-త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా ఓకే అయిన విషయం తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని