Tokyo Olympics: బాగానే ఆడారు.. బాధ పడొద్దు.. హాకీ కెప్టెన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌ - telugu news pm modi called to hockey india captain manpreet singh
close
Published : 03/08/2021 11:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tokyo Olympics: బాగానే ఆడారు.. బాధ పడొద్దు.. హాకీ కెప్టెన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఆగిపోయిన భారత పురుషుల హాకీ జట్టుకు ప్రధాని నరేంద్రమోదీ అండగా నిలిచారు. గెలుపోటములు జీవితంలో భాగమేనని తెలిపారు. సెమీసులో బెల్జియంపై సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా పోరాడారని పేర్కొన్నారు. మ్యాచ్‌ ముగిసిన తర్వాత ఆయన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌తో మాట్లాడారు.

ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన మన్‌ప్రీత్‌ సేన సెమీస్‌లో పోరాడి ఓడిన సంగతి తెలిసిందే. నాలుగో క్వార్టర్‌ ఆరంభం వరకు 2-2తో ఆశలు రేపిన టీమ్‌ఇండియా ఆఖరి నిమిషాల్లో మ్యాచుపై పట్టు వదిలేసింది. వరుస పెనాల్టీ కార్నర్లు ఇవ్వడంతో 5-2 తేడాతో ఓటమి చవిచూసింది. ప్రపంచ నంబర్‌ వన్‌ జట్టైన బెల్జియం ఒత్తిడిని అధిగమించి కీలక సమయాల్లో గోల్స్‌ సాధించింది. మరో సెమీస్‌లో పరాజితతో టీమ్‌ఇండియా కాంస్య పోరులో తలపడనుంది.

భారత్‌, బెల్జియం సెమీస్‌ పోరును ప్రధాని నరేంద్రమోదీ వీక్షించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్‌ చేశారు. ‘ఒలింపిక్స్‌లో భారత్‌, బెల్జియం పురుషుల హాకీ సెమీస్‌ను చూస్తున్నాను. మన జట్టు నైపుణ్యాలను చూసి గర్విస్తున్నాను. గెలవాలని కోరుకుంటున్నాను’ అని మొదట ట్వీట్‌ చేశారు. ‘గెలుపోటములు జీవితంలో భాగం. టోక్యో ఒలింపిక్స్‌లో మన హాకీ జట్టు అత్యుత్తమంగా పోరాడింది. అదే మనకు ముఖ్యం. తర్వాతి మ్యాచు, భవిష్యత్తు సిరీసుల్లో గెలవాలని నేను కోరుకుంటున్నా. మన ఆటగాళ్లను చూసి భారత్‌ గర్విస్తోంది’ అని తెలిపారు. మ్యాచు ముగిసిన తర్వాత ఆయన కెప్టెన్‌ మన్‌ప్రీత్‌కు ఫోన్‌ చేశారు. ఇప్పటి వరకు టీమ్‌ఇండియా ప్రదర్శన చాలా బాగుందని, కాంస్య పోరులో రాణించాలని వెన్నుతట్టారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని