Maa Elections: ‘మా’లో ఉన్నది 900మంది కాదు.. అసలు లెక్క ఇదీ: ప్రకాశ్‌రాజ్‌ - telugu news prakash raj talking about telugu cinema indsutry and maa elections
close
Published : 15/09/2021 01:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Maa Elections: ‘మా’లో ఉన్నది 900మంది కాదు.. అసలు లెక్క ఇదీ: ప్రకాశ్‌రాజ్‌

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) మసకబారడానికి అందులో ఉన్న 900మంది సభ్యులు కారణం కాదని, మనం ఎన్నుకునే 30మందే కారణమని సినీ నటుడు, మా ఎన్నికల అధ్యక్ష అభ్యర్థి ప్రకాశ్‌రాజ్‌ అన్నారు. మంగళవారం సినీ‘మా’బిడ్డలం పేరుతో తన ప్యానెల్‌ సభ్యులు, ఆయనకు మద్దతు తెలిపే వారితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడారు. ‘‘రెండేళ్ల కిందట మా ఎన్నికలు జరిగిన సమయంలో కూడా నేను పోటీ చేద్దామనుకున్నా. కొందరు రమ్మన్నారు.. ఇంకొందరు వద్దన్నారు. తప్పు చేసిన వాడిని చరిత్ర మర్చిపోవచ్చేమో కానీ, మౌనంగా ఉన్న వాడిని క్షమించదు. అందుకే నేను మౌనంగా ఉండకూడదనిపించింది. నేను ఎంత ఎదిగినా ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. మనిషి ఎదిగిన ఎత్తును బట్టి అతడిని కొలవకూడదు. వాడు ఎంతమందిని ఎదగనిచ్చాడో దాన్ని బట్టి కొలవాలి. అది నా తల్లి నాకు నేర్పిన పాఠం. మనకు తెలియకుండానే ‘మా’ను ఓ ఛారిటీ అసోసియేషన్‌గా మార్చేశారు. చనిపోయినప్పుడు డబ్బులు ఇవ్వడం, రేషన్‌ ఇప్పించడం, వేషాలు దక్కేలా చూడటం.. ఇది కాదు ‘మా’ అసోసియేషన్‌. ఇది ఆర్టిస్టులను బలపరిచే అసోసియేషన్‌గా ఉండాలి. ఆర్టిస్ట్‌కు కష్టం లేకుండా చేసేలా అసోసియేషన్‌ పనిచేయాలి. అసలు సమస్యను పరిష్కరించాలంటే ముందు దానిపై అవగాహన ఉండాలి’’

సాయం చేయాల్సింది 250మందికి మాత్రమే!

‘‘మా’ అసోసియేషన్‌లో 900మంది సభ్యులున్నారని అందరూ అంటున్నారు. అందులో సుమారు 150మంది యాక్టివ్‌ మెంబర్స్‌ కాదు. జెనీలియా మాజీ సీఎం కొడుకును వివాహం చేసుకుని వెళ్లిపోయారు. ఆమె యాక్టివ్‌ మెంబర్‌కారు. అలాంటి వాళ్లను తీసేస్తే, 750మంది మాత్రమే ఉన్నాం. అందులో 147మంది స్థానికులు కాదు. చెన్నై, బెంగళూరు, కేరళ నుంచి వచ్చి తమ షూటింగ్‌ పూర్తి చేసుకుని వెళ్లిపోతారు. వాళ్లకు అమౌంట్‌, బస, ఫ్లైట్‌ టికెట్స్‌కు డబ్బులు కూడా బాగానే ఇస్తారు. ఇక ఉన్నది 600మంది మాత్రమే! అందులో కొందరు యువ కథానాయకులు, పెద్ద పెద్ద నటులు ఓటింగ్‌కు రారు. వాళ్లకు అవసరం లేదు. మిగిలింది 450మంది. అందులో కూడా 200మంది బాగానే ఉన్నారు. ఇంకా ఆదుకోవాల్సింది 250మందిని మాత్రమే. ఆదుకోలేమా! అందులో 40 రంగస్థల కళాకారులు ఉన్నారు. వాళ్లకు సినిమా పాలిటిక్స్‌ తెలియవు. ఎక్కడకు వెళ్లాలో తెలియదు. కొంచెం కౌన్సిలింగ్‌ ఇస్తే, సినిమా కెమెరాకు అనుగుణంగా చక్కగా నటిస్తారు. నేను ఊరికినే ఎన్నికలకు రాలేదు. ఆరు నెలల పాటు ఈ హోం వర్క్‌ చేసుకుని వచ్చా! ‘నాటక కళాకారులకు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి కదా! ఎందుకు అందించటం లేదు’ అని నేను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌గారిని అడిగితే, ‘మమ్మల్ని ఎవరూ అడగలేదు కదా’ అని అన్నారు. మంచి చేయాలనుకుంటున్నారు కానీ, ఎలా చేయాలో ఎవరికీ తెలియదు’’

100మంది వైద్యులతో క్లబ్‌ ఏర్పాటు చేస్తాం!

‘‘నాకు వ్యక్తిగతంగా కొంతమంది వైద్యులు తెలుసు. ‘నేను మా అసోసియేషన్‌ అధ్యక్షుడినైతే, నాకు 100మంది వైద్యులను ప్రత్యేకంగా సినిమా ఆర్టిస్ట్‌లకు ఇప్పించొచ్చు కదా’ అని అడిగాను. అందుకు వాళ్లు ఒప్పుకొన్నారు. 100మంది వైద్యులతో క్లబ్‌ ఏర్పాటు చేస్తాం. మా అధ్యక్షుడిగా ఎన్నికైన మూడు నెలల్లో ‘మా’ అసోసియేషన్‌ ఆఫీస్‌లో ప్రతి ఒక్కరికీ హెల్త్‌కార్డు ఉంటుంది. ‘నేను చేశాను’ అంటూ వచ్చే వాడు ఏమీ చేయడు. కానీ నేను, 10మందితో చేయిస్తాను. 10 మందితో కలిసి చేస్తాను. పేద కళాకారుల పిల్లలను దత్తత తీసుకుని వారి చదువుకు అయ్యే ఖర్చు భరించేలా హీరోలను ప్రోత్సహిస్తా. కొవిడ్‌ సమయంలో ‘నవరస’ ప్రాజెక్టు చేసి పేద కళాకారులను ఆదుకున్నాం. తెలుగులోనూ సాయం అడిగితే చేసేందుకు త్రివిక్రమ్‌, పూరి జగన్నాథ్‌, కృష్ణవంశీ, క్రిష్‌, నాని, శర్వానంద్‌ ఇలా అందరూ ముందుకు వస్తానని అన్నారు. ‘మా’ అసోసియేషన్‌లో బాగా ఉన్న 200మందితో పని చేయించడానికి వస్తున్నాం. ఇక నుంచి మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో నలుగురు కో-ఆర్డినేటర్స్‌ ఉంటారు. ప్యానెల్‌లో ఉన్న 26మందికీ 26 ఫోన్‌ నెంబర్లు ఉంటాయి. ఈ మెంబర్స్‌ సినిమా సెట్స్‌కు వెళ్లి, ఆ ప్రాజెక్టులో పనిచేస్తున్న ‘మా’ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటారు. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఎంత పెద్ద హీరో, హీరోయిన్‌ అయినా, వాళ్లను నేను అధ్యక్షుడిని, వాళ్లు ‘మా’లో సభ్యులు’’ అని ప్రకాశ్‌రాజ్‌ అన్నారు.

ఇంకా ‘మా’ ఎన్నికలు, చిత్ర పరిశ్రమ, ఇతర నటీనటుల గురించి ప్రకాశ్‌రాజ్‌ పదునైన మాటల ప్రవాహం ఈ వీడియోలో చూడండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని