ఆలయాలకు రూ.కోట్లు ఇస్తున్నారు.. రైతులకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తే తప్పేంటి?: రేవంత్‌ - telugu news revanth reddy supports sugarcane farmers in zahirabad
close
Published : 25/09/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలయాలకు రూ.కోట్లు ఇస్తున్నారు.. రైతులకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తే తప్పేంటి?: రేవంత్‌

హైదరాబాద్‌‌: తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న జహీరాబాద్‌ చెరకు రైతులకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా చెరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆలయాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారని.. రైతులకు రివాల్వింగ్‌ ఫండ్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. చెరకును ప్రభుత్వమే కర్ణాటక మిల్లులకు తరలించాలన్నారు. మద్దతు ధర కల్పిస్తే రైతుబంధు, బీమా, రుణమాఫీ అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చెరకు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వా్న్ని నిలదీస్తామన్నారు. చెరకు ఫ్యాక్టరీలు నడిపించలేని సీఎం.. రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని రేవంత్‌ ప్రశ్నించారు.  

ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చెరకు రైతులు బంద్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. జహీరాబాద్‌లో రైతులు భారీ ర్యాలీ చేపట్టి తమ సమస్యలను పరిష్కరించాలని నినదించారు. జహీరాబాద్‌ ప్రాంతంలో దాదాపు 20 వేల ఎకరాల్లో 10లక్షల మెట్రిక్‌ టన్నుల చెరకు సాగు చేస్తున్నారు. అయితే, జహీరాబాద్‌ సమీపంలోని చక్కెర పరిశ్రమలో రెండేళ్లుగా పనులు సాగించడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు మంత్రులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ఈ నేపథ్యంలో రైతులు భారీ ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని