Road Accident: ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి - telugu news road accident in medchal district shameerpet
close
Published : 28/09/2021 12:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Road Accident: ఆగి ఉన్న కంటైనర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి

శామీర్‌పేట: ఆగి ఉన్న కంటైనర్‌ను వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలం మజీద్‌పుర్‌- తుర్కపల్లి గ్రామాల మధ్య చోటు చేసుకుంది. శామీర్‌పేట ఎస్సై వీరశేఖర్‌, బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం స్తంభంపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్(35), అదే గ్రామానికి చెందిన కారు డ్రైవర్ రాజేందర్‌(35), ధర్మపురి మండలం నాగారం గ్రామానికి చెందిన వంశీ(22) శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లారు. సుదర్శన్‌ తండ్రి దుబాయ్‌ వెళ్తుండగా అతడికి వీడ్కోలు పలికేందుకు వచ్చిన వీరు తిరుగు పయనమైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఘటనలో సుదర్శన్, రాజేందర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన వంశీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని