Sunil: కల్పిత కథతో ‘దర్జా’ - telugu news sunil announced new movie
close
Updated : 22/10/2021 07:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sunil: కల్పిత కథతో ‘దర్జా’

సునీల్‌, అనసూయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దర్జా’. సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శివశంకర్‌ పైడిపాటి నిర్మాత. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా పేరుతో కూడిన ప్రచార చిత్రాన్ని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘నిర్మాత శివశంకర్‌ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి. ఆయన నిర్మిస్తున్న ఈ సినిమా పేరు, లుక్‌ చాలా బాగుంద’’న్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘కల్పిత కథతో యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. సునీల్‌, అనసూయ పాత్రలు హైలెట్‌గా     నిలుస్తాయి. సీనియర్‌ నటులు, కొత్తతరం నటుల మేళవింపుగా చిత్రం రూపొందింది. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తాం’’ అన్నారు.    అక్సాఖాన్‌, షమ్ము, సత్తిపండు, షకలక శంకర్‌, సుధ, సూర్య, మిర్చి హేమంత్‌  నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: దర్శన్‌, సంగీతం: రాప్‌ రాక్‌ షకీల్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని