MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి తప్పుకొన్న బండ్ల గణేశ్‌ - telugu news what happens in maa and prakash raj pannel
close
Updated : 05/09/2021 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి తప్పుకొన్న బండ్ల గణేశ్‌

ట్వీట్‌ చేసిన నిర్మాత

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠగా మారుతున్నాయి. విడివిడిగా పోటీ చేస్తారనుకున్న జీవితా రాజశేఖర్‌, హేమ.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌లోకి అడుగుపెట్టి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. తాజాగా నిర్మాత బండ్ల గణేశ్‌.. ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించి షాక్‌కు గురి చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ప్రకాశ్‌రాజ్‌ని ట్యాగ్‌ చేస్తూ గణేశ్‌ ఓ ట్వీట్‌ పెట్టారు.

‘గౌరవనీయులైన ప్రకాశ్‌రాజ్‌ గారు, మీ ప్యానల్‌కు అధికార ప్రతినిధిగా నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. నా వ్యక్తిగత కారణాల వల్ల ఆ పదవికి సంతృప్తికరంగా న్యాయం చేయలేకపోతున్నాను. దయచేసి ఆ పదవికి వేరే వారిని నియమించగలరు. మీ టీమ్‌ మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని బండ్ల గణేశ్‌ ట్వీట్‌ చేశారు.

మరి కొన్ని రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయనున్న తన టీమ్‌ని పరిచయం చేస్తూ ఇటీవల ప్రకాశ్‌రాజ్ ఓ ప్రెస్‌మీట్‌ పెట్టారు. అందులో భాగంగానే జీవిత, హేమ తన టీమ్‌లో ఉన్నారని వెల్లడించారు. అంతేకాకుండా తన టీమ్‌లో ఉన్న 24మంది సభ్యులు, వాళ్ల పదవుల గురించి వివరించారు. ఈ క్రమంలోనే నటుడు సాయికుమార్‌, బండ్ల గణేశ్‌ అధికారి ప్రతినిధులుగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. అయితే బండ్లగణేశ్‌ తాజా నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని