ఒలింపిక్స్‌లో మరో 4 క్రీడలకు అవకాశం! - this years four new olympic sportsm broken down
close
Published : 25/07/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒలింపిక్స్‌లో మరో 4 క్రీడలకు అవకాశం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈసారి టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగు  క్రీడలకు అదనంగా చోటు దక్కింది. అవి కరాటే, స్కేట్‌ బోర్డింగ్‌, సర్ఫింగ్‌,  క్లైంబింగ్‌.

కరాటే: ఆగస్టు 5-7 మధ్యన పోటీలు ఉంటాయి. జపాన్‌ కరాటేకు చాలా ప్రసిద్ధి. 20 వ శతాబ్దం ప్రారంభంలో జపాన్‌ అంతటా కరాటే వేగంగా వ్యాపించింది. ప్రస్తుతం ప్రపంచమంతా కరాటేకు ఆదరణ లభిస్తోంది. దీన్ని 1970 నుంచి ఒలింపిక్స్‌లో చేర్చాలనే డిమాండ్‌ ఉంది. కానీ ఎట్టకేలకు జపాన్‌లో జరుగుతుండటం వల్లనేమో ఈ క్రీడ ఈసారి ఒలింపిక్స్‌లో భాగమైంది. స్త్రీపురుషులకు నాలుగు ప్రత్యేక ఈవెంట్స్‌ ఉంటాయి. 3 విభిన్న వెయిట్‌ కేటగరీల్లో పోటీలు ఉంటాయి

స్కేట్‌ బోర్డింగ్‌: జులై 25న పురుషుల విభాగంలో పోటీ ప్రారంభమవుతుంది. ఎత్తుకు ఎగిరే ట్రిక్స్‌, స్టంట్స్‌ ఉంటాయి. 12 ఏళ్ల నుంచి 47 ఏళ్ల వరకు ఇందులో పాల్గొంటారు. అమెరికా నుంచి నైజా హుస్టన్‌(పురుషుల) పాల్గొంటారు. బ్రిటన్‌ నుంచి మహిళల విభాగంలో 13 ఏళ్ల స్కై బ్రౌన్‌ బరిలో ఉంటారు. ఇది స్ట్రీట్‌, పార్క్‌ స్కేటింగ్స్‌ ఉంటాయి. స్టెయిర్స్‌, రెయిలింగ్స్‌, బెంచీలు తదితర వస్తువులను ఉపయోగించుకుంటూ స్కేటర్లు పలు విన్యాసాలు చేస్తారు.

 సర్ఫింగ్‌: అలలతో సయ్యాటలాడే ఈ మూడు రోజుల పోటీలను వాతావరణ అనుకూలతను బట్టి ఎనిమిది రోజుల్లోపు నిర్వహిస్తారు. ఆదివారం ప్రారంభమవుతుంది.  టోక్యోకు 60 మైళ్ల దూరంలో గల సముద్రతీరంలోని పట్టణంలో దీన్ని నిర్వహిస్తారు. ఇంటర్నేషనల్‌ సర్ఫింగ్‌ అసోసియేషన్‌ 1995 నుంచి ఒలింపిక్‌ కమిటీని అడుగుతుండటంతో ఎట్టకేలకు ఈసారి చోటు దక్కింది.

క్లైంబింగ్‌: ఆగస్టు 3 - 6 మధ్యన ఈ పోటీలు ఉంటాయి. ఇటీవలి సంవత్సరాల్లో దీనికి బాగా ఆదరణ పెరగడంతో ఒలింపిక్స్‌లో చోటు సంపాయించుకుంది. 95 డిగ్రీల కోణంలో నిలబడిన15 మీటర్ల గోడను ఎక్కాల్సి ఉంటుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని