Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 10/08/2021 19:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సెట్‌లో రామ్‌చరణ్‌ అసహనం..

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ప్రస్తుతం ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ ఉక్రెయిన్‌లో శరవేగంగా జరుగుతోంది. చరణ్‌-తారక్‌లపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఉక్రెయిన్‌లో టీమ్‌ ఏం చేస్తుంది? అక్కడ షూట్‌ ఎలా జరుగుతుంది? ఇలాంటి విశేషాలు తెలియజేస్తూ నేటి నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇన్‌స్టా ఖాతాలో పోస్టులు చేయనున్నట్లు తారక్‌ తెలిపారు. ఇందులో భాగంగా ఆయన తాజాగా ఓ వీడియో షేర్‌ చేశారు. రామ్‌చరణ్‌ కొంత అసహనానికి గురైనట్లు ఇందులో చూడవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* MAA Elections: హేమపై చర్యలు తీసుకుంటాం: నరేశ్‌

2. OBC Bill: ఓబీసీ బిల్లుకు ప్రతిపక్షాల మద్దతు.. ఆందోళన చేయబోమన్న నేతలు

పెగాసస్‌ సహా పలు అంశాలపై ఆందోళనలు చేస్తూ పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్న ప్రతిపక్షాలు.. ఒక్క విషయంలో మాత్రం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. రాష్ట్రాల స్థాయిలో వెనుకబడిన తరగతులను గుర్తించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెడుతూ కేంద్రం నేడు ప్రవేశపెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇస్తున్నట్లు విపక్షాలు ఏకగ్రీవంగా ప్రకటించాయి. ఈ బిల్లు వచ్చినప్పుడు ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా చర్చలో పాల్గొంటామని వెల్లడించాయి. ఇది చాలా ముఖ్యమైన అంశమని, అందుకే కేంద్రానికి మద్దతివ్వాలని నిర్ణయించినట్లు విపక్ష నేతలు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Tokyo Olympics: ఆటలో ఓడినా.. స్ఫూర్తి రగిలించారు..!
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ టోక్యో ఒలింపిక్స్‌ ఘనంగా జరిగాయి. ఈ విశ్వక్రీడలు పలువురు భారత క్రీడాకారులకు తీపి జ్ఞాపకాలు అందించగా మరికొందరికి అంతులేని దుఃఖాన్ని మిగిల్చాయి. మొత్తం 127 మంది అథ్లెట్లతో వివిధ పోటీల్లో తలపడిన భారత్‌ ఏడు పతకాలు సాధించింది. ఒలింపిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ విషయం పక్కనపెడితే టోక్యో ఒలింపిక్స్‌లో మరికొంత మంది అథ్లెట్లు కూడా మెరుగైన ప్రదర్శన చేసినా దురదృష్టవశాత్తూ ఓటమిపాలై త్రుటిలో పతకాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
4. TS News: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేశవరావు కన్నుమూత
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పి. కేశవరావు(60) కన్నుమూశారు. అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. జస్టిస్‌ కేశవరావు మృతితో రాష్ట్రంలోని కోర్టులకు ఉన్నత న్యాయస్థానం ఇవాళ సెలవు ప్రకటించింది. 2017 సెప్టెంబర్‌ 21 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ కేశవరావు సేవలు అందించారు. న్యాయమూర్తి మృతి పట్ల ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి
5. Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

జూన్‌ చివరి వారంలో థియేటర్లలో సినిమా సందడి మొదలైన తర్వాత గత వారం కూడా పలు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేశాయి. అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే భారీ బాలీవుడ్‌ చిత్రాలన్నీ ఓటీటీల వేదికగా వస్తుండటం గమనార్హం. స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని అటు థియేటర్‌లలో, ఇటు ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Road Accident: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి

గుజ్‌రాత్‌లోని అమ్రేలి జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు వృద్ధులతో సహా ఎనిమిది మంది దుర్మరణం చెందారు. బదడ గ్రామంలో రోడ్డు పక్కన గుడిసెలో నిద్రిస్తున్న వారిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఈ దుర్ఘటన జరిగింది. రాజ్‌కోట్‌ నుంచి జఫ్రాబాద్‌ వెళ్తున్న ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో గుడిసెలో ఉన్న 10 మందిలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

AP News: టిప్పర్‌కు కరెంట్‌ తీగలు తగిలి ముగ్గురి మృతి

7. Voter card to Aadhaar link: చట్ట సవరణ లేకుండానే ఓటరు కార్డుకు ఆధార్‌తో లంకె

ప్రస్తుతం ఉన్న నిబంధనల మేరకే ఓటరు గుర్తింపుకార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం మరోసారి కసరత్తును ప్రారంభించింది. కొత్త ఓటర్లను నమోదు చేసే సమయంలో ఆధార్‌ను ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థను కేంద్ర న్యాయశాఖ కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం చేసిన సూచన ఆధారంగా ఈ మేరకు లేఖ రాసింది. ‘సుపరిపాలన కోసం ఆధార్‌ ధ్రువీకరణ నిబంధన’ల్లోని రూల్‌-3 ప్రకారం అనుమతి ఇవ్వాలని కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Revanth Reddy: రాజకీయంగా నష్టమని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు: రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ పాలనలో ప్రపంచం ముందు భారత్‌ శక్తిమంతమైన దేశంగా నిలబడిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. దేశానికి కాంగ్రెస్‌ స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛావాయువులను ఇచ్చిందని.. కానీ ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని అంబానీ, అదానీలకు తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘క్విట్‌ ఇండియా డే’ సందర్భంగా గాంధీభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్‌ మాట్లాడారు. కేసీఆర్‌, మోదీ ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Raghurama: ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైంది: రఘురామ

9. Varudu Kavalenu: అనంతశ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు

ప్రముఖ సినీ పాటల రచయిత అనంత్‌ శ్రీరామ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ‘వరుడు కావలెను’ సినిమా కోసం ఆయన ‘దిగు దిగు దిగు నాగ’ పాట రాశారు. అయితే ఈ పాట అశ్లీలంగా మహిళలను కించపరుస్తూ.. నాగదేవత, సుబ్రహ్మణ్యం స్వామి తదితర దేవతామూర్తులను ప్రస్తావిస్తూ ఉందంటూ పలువురు మండిపడుతున్నారు. ఆ పాటను తొలగించాలంటూ భాజపా మహిళా మోర్చా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షురాలు బిందురెడ్డి చిల్లకూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. NASA: అంగారకుడిపై నివాసముంటారా? దరఖాస్తులు ఆహ్వానించిన నాసా 

భూమిపై నివసించడం బోర్‌ కొడుతోందా? ఇలాంటి వాతావరణంలో కాకుండా.. మరేదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఉండాలనుకుంటున్నారా? అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ- ‘నాసా’ తాజాగా విడుదల చేసిన ప్రకటన మీలో ఆసక్తిని పెంచుతుంది! అంగారక గ్రహం తరహాలో కృత్రిమంగా సృష్టించిన వాతావరణంలో ఏడాది పాటు నివసించేందుకుగాను ఔత్సాహికుల నుంచి ఆ సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుతానికి అమెరికా పౌరులు, అక్కడ శాశ్వత నివాస హోదా ఉన్నవారే దీనికి అర్హులు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని