Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు - top ten news at 1 pm
close
Updated : 17/08/2021 13:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

​​​​​​

1. Afghanistan: తాలిబన్ల సంచలన నిర్ణయం.. ప్రజలందరికీ క్షమాభిక్ష

అఫ్గానిస్థాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకున్న తాలిబన్లు నేడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు. ‘‘ప్రతి ఒక్కరికీ క్షమాభిక్ష ప్రకటిస్తున్నాం. అందువల్ల మీరు పూర్తి విశ్వాసం, భరోసాతో జీవనం సాగించండి. ప్రజలంతా సాధారణ, రోజువారీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు. ప్రభుత్వ అధికారులంతా విధులకు హాజరుకావాలి’’ అని తాలిబన్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Facebook: తాలిబన్లను ఉగ్రవాదులుగా పేర్కొన్న ఫేస్‌బుక్‌..!

2. జగన్‌ అక్రమాస్తుల కేసు: మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేసిన ఈడీ

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మరో 2 అభియోగపత్రాలు (ఛార్జిషీట్లు) దాఖలు చేసింది. ఈ వ్యవహారంలో సీబీఐ ఇప్పటి వరకు దాఖలు చేసిన 11 ఛార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్న ఈడీ.. ఇప్పటికే 7 అభియోగపత్రాలను కోర్టుకు సమర్పించింది. వాటిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. దీంతో పాటు తాజాగా వాన్‌పిక్‌, లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసులకు సంబంధించిన మరో 2 ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 17 నుంచి నవంబర్‌ 14 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఒమన్‌తో పాటు యూఏఈలో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. నవంబర్‌ 10, 11 తేదీల్లో సెమీఫైనల్‌.. నవంబర్‌ 14న ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వు డే కేటాయించారు. అక్టోబర్‌ 24న భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

KL Rahul: మీరు ఒకరి వెంట పడితే మేం 11 మంది మీ వెంట పడతాం..

4. KTR: బండి సంజయ్‌ ట్వీట్‌పై కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రం

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ‘దరఖాస్తుల ఉద్యమం’పై మంత్రి కేటీఆర్‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరీంనగర్‌లో దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించినట్లు సోమవారం బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందిస్తూ ‘‘ప్రధాని నరేంద్ర మోదీ వాగ్దానం ప్రకారం ప్రతి పౌరుడికి రూ.15లక్షల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ తెలంగాణ భాజపా శాఖ తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నాను’’ అని వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Afghanistan: అఫ్గాన్‌ పౌరుల కోసం భారత్‌ ‘ఎమర్జెన్సీ వీసాలు’

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అఫ్గాన్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. ‘‘అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీసా నిబంధనలపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేపట్టి వీసా నిబంధనల్లో మార్పులు చేసింది. భారత్‌కు వచ్చేందుకు అఫ్గాన్లు చేసుకున్న వీసా దరఖాస్తుల ఫాస్ట్‌ట్రాక్ పరిశీలన కోసం e-Emergency X-Misc Visa పేరుతో ప్రత్యేక కేటగిరీ ఎలక్ట్రానిక్‌ వీసాలను ప్రవేశపెట్టింది’’ అని హోంశాఖ అధికార ప్రతినిధి ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Afghanistan: కాబుల్‌లో భారత ఎంబసీ మూసివేత.. అధికారుల తరలింపు

6. India Corona: భారీగా తగ్గిన కొత్త కేసులు.. 

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో రెండో దశ ఉద్ధృతి ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారిగా కొత్త కేసులు 25 వేలకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. కొత్త కేసులు సుమారు ఐదు నెలల కనిష్ఠానికి చేరాయి. ముందురోజుతో పోల్చితే 23.5 శాతం మేర తగ్గాయి. అదే సమయంలో క్రియాశీల రేటు, రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉంది. తాజాగా మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Tollywood: చిరు.. బాలకృష్ణ.. నాగచైతన్య.. అఖిల్‌ ఎప్పుడొస్తారు?

ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియదు. కరోనా కల్లోలం ప్రభావం ఫలితమే అదంతా. తొలి కాపీతో సిద్ధమైన సినిమాలు కూడా వేచి చూడాల్సి వస్తోంది. ఇక సెట్స్‌పై ఉన్న సినిమాల సంగతి సరే సరి. వాటి చిత్రీకరణ సజావుగా సాగాలి, విజయవంతంగా పూర్తి కావాలి, విడుదల కోసం థియేటర్ల దగ్గర తగిన ఖాళీ దొరకాలి. అప్పుడు కానీ బొమ్మ తెరపై పడే అవకాశం ఉండదు. అయినా సరే... సినీ వర్గాలు మాత్రం ఎప్పట్లాగే విడుదల కోసం కట్చీప్‌లు వేయడం మొదలు పెట్టేశాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Chathur Mukham Review: చతుర్‌ ముఖం రివ్యూ

8. Fractional Ownership: ఇలా ఇన్వెస్ట్‌ చేస్తే.. ఖరీదైన ఆస్తులు కొనడం కష్టమేం కాదు!

ఓ విలాసవంతమైన కారు, విల్లా, ఓ కంపెనీలో భాగస్వామ్యం.. ఇవన్నీ కలగానే మిగిలిపోయే మధ్యతరగతి ప్రజల ఆశలు. కానీ, పెట్టుబడుల్లో వస్తున్న కొత్త పోకడల్ని అవలోకనం చేసుకొని.. జాగ్రత్తగా ఇన్వెస్ట్‌ చేయగలిగితే.. ఒక 5-8 సంవత్సరాల్లో వీటిని సొంతం చేసుకోవడం సాధ్యమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఉదాహరణకు ఓ బీఎండబ్ల్యూ ఎక్స్‌1 అనే కారుని తీసుకుందాం. దీని ధర దాదాపు రూ.45 లక్షల వరకు ఉంది. మన దగ్గర ఇప్పటికే రూ.25 లక్షలు ఉన్నాయనుకుందాం!  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Viveka Murder Case: సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 72వ రోజు కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. విచారణలో భాగంగా ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. మరోవైపు కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారుల మరో బృందం చేపట్టిన విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌ కుమార్‌ హాజరయ్యారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Virat Kohli: మైదానంలో  కవ్వింపులే మమ్మల్ని గెలిపించాయి!

ఇంగ్లాండ్‌ ఆటగాళ్ల కవ్వింపుల వల్లే జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి పట్టుదలగా పరుగులు చేశారని టీమ్‌ఇండియా సారథి విరాట్‌కోహ్లీ అన్నాడు. 60 ఓవర్లలో ప్రత్యర్థిని ఆలౌట్‌ చేయగలమన్న ఆత్మవిశ్వాసం కలిగిందని పేర్కొన్నాడు. లార్డ్స్‌లో విజేతగా అవతరించిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు. ‘మొత్తం జట్టును చూసి గర్వపడుతున్నా. మేం మా ప్రణాళికలను కచ్చితత్వంతో అమలు చేశాం. తొలి 3 రోజులు పిచ్‌ అంతగా సహకరించలేదు. తొలి రోజైతే అత్యంత కఠినంగా అనిపించింది’ అని కోహ్లీ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని