close
Published : 28/03/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కటౌట్లు, పాలాభిషేకాలు అవసరం లేదు: నాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: నా అభిమానులుగా ఉన్న మీరంతా గర్వపడేలా చేసేందుకు ప్రతిరోజూ కష్టపడుతూనే ఉంటానని అన్నారు నాని. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ‘టక్‌ జగదీష్‌’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ కథానాయికలు. జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘పరిచయ వేడుక’ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా నాని మాట్లాడారు.. ‘‘ఏడాది పాటు అభిమానులను చాలా మిస్‌ అయ్యాను. మళ్లీ ఇప్పుడు ఇలా చూస్తుండడం చాలా సంతోషంగా ఉంది. అందరిలా నాకోసం గొడవలు పడటమో.. కటౌట్లు పెట్టడం.. పాలాభిషేకాలు చేయడం నాకు అవసరం లేదు. నన్ను చూసి మీరు గర్వపడేలా చేసేందుకు ప్రతిరోజూ కష్టపడతానని ప్రమాణం చేస్తున్నా’’ అని అన్నారు. ఈ సందర్భంగా సినిమాలోని అన్ని పాత్రలను అభిమానులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి ‘పరిచయ వేడుక’ అని పేరు పెట్టడానికి కారణం అదేనని ఆయన అన్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని