ఇద్దరు క్రికెటర్లకు కరోనా - two south african cricketers testes corona positive
close
Published : 20/08/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇద్దరు క్రికెటర్లకు కరోనా

పేర్లు బహిర్గతం చేయని దక్షిణాఫ్రికా క్రికెట్‌ సంఘం

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: దక్షిణాఫ్రికాలో ఇద్దరు క్రికెటర్లు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆటగాళ్లు, సిబ్బందికి కలిపి 50 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరు పాజిటివ్‌గా తేలారు. వారి పేర్లను క్రికెట్‌ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) బహిర్గతం చేయలేదు. పరీక్షలు చేయించుకున్న వారిలో కెప్టెన్‌ క్వింటన్‌ డికాక్‌, మార్క్రమ్‌, ఫెలుక్‌వాయో, డీన్‌ ఎల్గర్‌, డేవిడ్‌ మిల్లర్‌, కాగిసో రబాడ, కేశవ్‌ మహరాజ్‌ వంటి ఆటగాళ్లు ఉన్నారు.

ఆగస్టు 18 నుంచి 22 వరకు కుకుజాలో పురుషుల జట్టుకు సీఎస్‌ఏ సాంస్కృతిక శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆటగాళ్లందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి కొవిడ్‌-19 ఉన్నట్టు తేలింది. ‘వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు నిబంధనల ప్రకారం పరీక్షలు చేశాం. ఇద్దరికి పాజిటివ్‌ రావడంతో ఐసోలేషన్‌కు పంపించాం. వారికి ప్రత్యామ్నాయంగా ఎవరినీ ఎంపిక చేయలేదు. అనుకోని కారణాలతో శిబిరానికి రాలేని వారిని వర్చువల్‌గా హాజరవ్వాలని సూచించాం’ అని సీఎస్‌ఏ ప్రకటించింది.

దక్షిణాఫ్రికా మాజీ సారథి ఫా డుప్లెసిస్‌ ఈ శిబిరానికి హాజరుకాలేదు. అతడు రెండోసారి తండ్రి కావడంతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు. దియూనిస్‌ డీబ్రూన్‌ కుటుంబ కారణాలతో మొదట మిస్సైనప్పటికీ ఇప్పుడు కుకుజాలో జట్టుతో కలిశాడు. దక్షిణాఫ్రికా క్రికెట్లో జాతివివక్షను పెరగకుండా అడ్డుకొనేందుకు సాంస్కృతిక శిబిరాలను ఏర్పాటు చేస్తారు. జులైలో మహిళల జట్టుకు ఇందు కోసమే 34 పరీక్షలు చేయగా ముగ్గురికి కొవిడ్‌-19 సోకినట్టు తెలిసింది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని