ఉద్వేగభరితంగా ‘విరాటపర్వం’ టీజర్‌ - virataparvam teaser
close
Updated : 18/03/2021 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఉద్వేగభరితంగా ‘విరాటపర్వం’ టీజర్‌

చిరంజీవి చేతుల మీదుగా విడుదల

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు చిరంజీవి చేతుల మీదుగా ఈ చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. భూస్వాముల ఆకృత్యాలను తన కవిత్వంతో ప్రజానీకానికి తెలియజేస్తుంటాడు రానా. రానా కవిత్వానికి ఫిదా అవుతుంది సాయి పల్లవి. ప్రేమ కోసం అన్నీ వదిలేసి రానా దగ్గరకు బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆమెను చుట్టుముట్టిన సమస్య ఏంటి? రానా కామ్రేడ్‌గా ఎందుకు మారాడు? ఈ వివరాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. రానా కవిత్వం చెప్పిన తీరు, సాయి పల్లవి సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది టీజర్‌. సురేశ్‌ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.

ఈ చిత్రంలో నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్ బాబు సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని