ఒక్క ఓవరూ పాండ్యకు భారమేనా?: వీరూ - virender sehwag unhappy with hardik pandya not bowling in odis
close
Published : 28/03/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒక్క ఓవరూ పాండ్యకు భారమేనా?: వీరూ

మరి 50 ఓవర్ల ఫీల్డింగుకూ అలసిపోతారు కదా అని ప్రశ్న

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో హార్దిక్‌ పాండ్యతో ఎందుకు బౌలింగ్‌ చేయించలేదని టీమ్‌ఇండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ప్రశ్నించాడు. జట్టుకు అవసరమైనప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడని విమర్శించాడు. అతడి పనిభారాన్ని ఎలా పర్యవేక్షిస్తున్నారో తెలియదన్నాడు. 50 ఓవర్లు ఫీల్డింగ్‌ చేసినా అలసిపోతారు కదా అని అడిగాడు. మూడో వన్డేకు ముందు వీరూ విమర్శల వర్షం కురిపించాడు.

రెండో వన్డేలో టీమ్‌ఇండియా నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ సునాయాసంగా ఛేదించింది. పేసర్లు భువనేశ్వర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణను మినహాయిస్తే మిగతా అందరి బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ చితకబాదారు. ముఖ్యంగా స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్య బౌలింగ్‌ను ఊచకోత కోశారు. దాంతో జట్టుకు ఆరో బౌలర్‌ అవసరం ఏర్పడింది. మ్యాచ్‌ ఓడిపోతున్నా సరే హార్దిక్‌కు విరాట్‌ బంతినివ్వలేదు. నైపుణ్యాల దృష్ట్యా మున్ముందు అతడు జట్టుకు అత్యంత కీలమని, అతడిపై పనిభారాన్ని పర్యవేక్షిస్తున్నామని ఆ తర్వాత వివరించాడు. దీనిపై సెహ్వాగ్‌ మండిపడ్డాడు.

‘వన్డే సిరీస్‌ తర్వాత ఉన్నది ఐపీఎల్‌ మాత్రమే. అంటే హార్దిక్‌ పాండ్యపై పనిభారం పర్యవేక్షణ కోసం సిరీస్ ఓడిపోయినా ఫర్వాలేదని మీరంటున్నారు. అతడి పనిభారంలో కనీసం 4-5 ఓవర్లు లేకపోతే అది తప్పే. అతడి చేత ఒక్క ఓవర్‌ కూడా వేయించకూడదా? 50 ఓవర్ల ఫీల్డింగూ అలసటకు కారణమవుతుంది. అందుకే 4-5 ఓవర్లు వేస్తే అతడిపై పనిభారమేమీ పెరగదు’ అని సెహ్వాగ్‌ అన్నాడు.

‘హార్దిక్‌ పనిభారం పెరుగుతోందని ఎవరు నిర్ణయిస్తారో నాకైతే తెలియదు. వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత పునరాగమనం చేసి అతడు ఎక్కువ క్రికెటేమీ ఆడలేదు. టెస్టులకు విశ్రాంతినిచ్చారు. 5 టీ20లు ఆడి 2-3 ఓవర్లే వేశాడు. అంటే అతడు ఎక్కువ శ్రమించలేదు. బహుశా ఐపీఎల్‌ ముందు గాయపడకుండా జాగ్రత్త పడేందుకు వన్డేల్లో బౌలింగ్‌ చేయనని పాండ్యనే అడిగేందుకు ఆస్కారమైతే ఉంది’ అని వీరూ అభిప్రాయపడ్డాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని