Viral Video: ఉబికి వస్తోన్న భూమి! - watch land starts rising abruptly in haryana video leaves netizens shocked
close
Published : 24/07/2021 23:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral Video: ఉబికి వస్తోన్న భూమి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా భూమి కుంగింది అనే మాట వింటూ ఉంటాం. కాని భూమి పైకి వచ్చింది అనే మాట వినడం మాత్రం అరుదే. ఈ అరుదైన అద్భుతం ఎక్కడ జరిగిందో తెలియకున్నా భూమి పైకి వస్తున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 

దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో చెరువులోని నీటిలో ఓ వైపు నుంచి మొదలై భూమి పైకి వస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ వీడియో తీస్తున్న వ్యక్తి, అక్కడ ఉన్న వాళ్లను దూరం జరగాలని, నేల మరింత దూరం అలా ఉబుకుతూ రావొచ్చని హెచ్చరించడం వినిపించింది. అయితే టెక్టానిక్ ప్లేట్లలో కదలికల వల్ల భూమి అలా పైకి ఉబికి వచ్చి ఉండవచ్చని భూశాస్త్రవేత్తలు అంటున్నారు. భూతాపం వల్ల కింది పొరల్లో మీథేన్ గ్యాస్ ఏర్పడి ఉంటుందని అక్కడ నీళ్లు ఉండడంతో నేల అలా పైకి వచ్చి ఉంటుందని మరికొంత మంది అభిప్రాయం. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని