దిల్లీలో ఒక్కరోజే 240 మంది మృతి - while delhi reported 25462 cases and 161 deaths
close
Published : 19/04/2021 23:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దిల్లీలో ఒక్కరోజే 240 మంది మృతి

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకీ కొవిడ్‌ బారినపడుతున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సోమవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 23,686 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా,  240 మంది మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీలో ఆరు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించారు. లాక్‌డౌన్‌ సోమవారం రాత్రి 10 గంటల నుంచి మొదలై వచ్చే సోమవారం ఉదయం 5 గంటల వరకూ అమల్లో ఉండనుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని