ఆ ఇద్దరు... మూడోసారి కలసి నటిస్తారా? - will balakrishna and sneha team up for third time
close
Updated : 28/07/2020 14:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆ ఇద్దరు... మూడోసారి కలసి నటిస్తారా?

ఇంటర్నెట్‌ డెస్క్: నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరా గెటప్‌ కనిపిస్తాడని వార్తలు రావడంతో సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల విడుదల చేసిన టీజర్‌ వాటిని రెట్టింపు చేసింది. ఇప్పుడు మరో వార్త ఆసక్తిని పెంచుతోంది. బోయపాటి స్టైల్‌, హిట్‌ ఫార్ములాను ఫాలో అవుతూ... ఈ సినిమాలో ఇద్దరు బాలకృష్ణలు ఉంటారని ఇప్పటికే వార్తలొచ్చాయి. వారిలో సీనియర్‌ బాలకృష్ణ సరసన నటించే ఓ కథానాయిక ఫిక్స్‌ అయ్యిందనేది కొత్త వార్త.

బాలకృష్ణతో ‘పాండురంగడు’, ‘మహారథి’లో నటించిన స్నేహ మూడోసారి కలసి నటించడానికి సిద్ధమవుతున్నారట. సీనియర్‌ బాలకృష్ణకు హీరోయిన్‌గా స్నేహ కనిపించబోతున్నారని టాక్‌. ఇప్పటికే జూనియర్‌ బాలకృష్ణ సరసన కొత్త హీరోయిన్‌ను తీసుకుంటామని బోయపాటి స్పష్టం చేశారు. బాలకృష్ణ - స్నేహ నటించిన ఆ రెండు సినిమాలకు సరైన స్పందన రాకపోయినా... మరోసారి ఆ జోడీని రిపీట్‌ చేయడానికి చిత్రబృందం ఆసక్తి చూపిస్తోందట. 

మరోవైపు అఘోరా పాత్రకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ కోసం హిమాలయాలకు వెళ్లాలని చిత్రబృందం గతంలో నిర్ణయించింది. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఆ ప్రయత్నాన్ని నిలిపేసినట్లు సమాచారం. హిమాలయాలకు బదులు హైదరాబాద్‌లోనే ఆ సన్నివేశాలు చిత్రీకరించాలని చిత్రబృందం భావిస్తోందట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బోయపాటి సినిమా స్క్రిప్ట్‌ను ఫైన్‌ ట్యూన్‌ చేసే పనిలో ఉన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని