T20 World Cup : భారత్‌, పాక్‌ పోరు.. ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది: హాసన్ అలీ - will try and replicate 2017 champions trophy final: pakistan all-rounder hasan ali on india game at t20 wc
close
Published : 16/09/2021 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

T20 World Cup : భారత్‌, పాక్‌ పోరు.. ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది: హాసన్ అలీ

కరాచీ: భారత్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుందని పాకిస్థాన్‌ పేసర్‌ క్రికెటర్‌ హాసన్‌ అలీ అన్నాడు. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య ఆట హోరాహోరీగా సాగనుందని చెప్పాడు. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్ ఫలితాన్నే టీ20 ప్రపంచకప్‌ పోరులో పునరావృతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత ఆ జట్టు భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి పాలైన విషయం తెలిసిందే. 2018 ఆసియా కప్‌, 2019 వన్డే ప్రపంచ కప్‌ పోరులో దాయాది దేశం పరాజయం పాలయ్యింది.

‘2017లో భారత్‌ని ఓడించి మేం ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాం. అదే స్ఫూర్తితో టీ20 ప్రపంచకప్‌లో కూడా మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచులపై ప్రపంచవ్యాప్తంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. సాధారణంగా క్రికెట్‌ మ్యాచులు చూడని అభిమానులు కూడా ఈ పోరుపై ఆసక్తి కనబరుస్తారు. కాబట్టి, భారత్‌తో తలపడటం ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఆటగాళ్లపై కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. అయినా, మెరుగ్గా రాణించేందుకు మా శాయశక్తులా ప్రయత్నిస్తాం’ అని హాసన్‌ అలీ పేర్కొన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని