సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు - wishes pour down on siraj
close
Published : 19/01/2021 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సిరాజ్‌.. ఇక కుర్రాడు కాదు

ఐదు వికెట్లు తీసిన హైదరాబాదీపై ప్రశంసల వర్షం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా యువపేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియాపై రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన అతడికి అభినందనలు తెలియజేస్తున్నారు. మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అయితే ‘అతడిక ఎంత మాత్రం కుర్రాడు కాదు..’ అని ట్వీట్‌ చేసేశాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి నడుచుకుంటూ వస్తున్న సిరాజ్‌ను బుమ్రా హత్తుకొని అభినందించడం నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ టెస్టులో అత్యుత్తమ సంఘటనగా దీనిని వర్ణిస్తున్నారు.

ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో సిరాజ్‌ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్టే తీసినా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 19.5 ఓవర్లు విసిరిన అతడు 73 పరుగులు ఇచ్చాడు. చక్కని లెంగ్తుల్లో, క్రమశిక్షణతో బంతులు విసిరాడు. అనవసర పొరపాట్లకు తావివ్వలేదు. కీలకమైన లబుషేన్‌, స్టీవ్‌స్మిత్‌, కామెరాన్‌ గ్రీన్‌ టెయిలెండర్లు మిచెల్‌ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ను పెవిలియన్‌కు పంపించాడు. అతడు ఈ సిరీసులోనే అరంగేట్రం చేసినప్పటికీ టీమ్‌ఇండియా బౌలింగ్‌ దాడిని ముందుండి నడిపించడం విశేషం. షమి, బుమ్రా, ఉమేశ్‌ స్థానాల్లో జట్టులోకి వచ్చిన శార్దూల్‌ ఠాకూర్‌, నటరాజన్‌కు మెలకువలు చెబుతూ ప్రోత్సహించాడు.

ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించిన సిరాజ్‌పై ప్రస్తుతం అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ‘ఈ సిరీసులోనే ఈ కుర్రాడు మగాడిగా అవతరించాడు. తొలి టెస్టు సిరీసులోనే సిరాజ్‌ బౌలింగ్‌ దాడికి నాయకత్వం వహించాడు. ముందుండి నడిపించాడు. ఈ సిరీసులో కొత్తవాళ్ల ప్రదర్శన ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. ‘ఆసీస్‌ సిరీస్‌లో మహ్మద్‌ సిరాజ్‌ ఆకట్టుకున్నాడు. మనసుపెట్టి బంతులు విసురుతున్నాడు. తొలిసారి ఐదు వికెట్ల ఘనత అందుకున్నందుకు అభినందనలు. నీ భవిష్యత్తు మరెంతో బాగుండాలి’ అని మహిళల జట్టు వన్డే సారథి మిథాలీరాజ్‌ పేర్కొంది.

ఐదు వికెట్ల ఘనత అందుకున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని సిరాజ్‌ అన్నాడు. ‘టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేసినందుకు ఐదు వికెట్లు తీసినందుకు గొప్పగా అనిపిస్తోంది. మా నాన్న ఇది చూస్తున్నారనే అనుకుంటున్నా. ఆయన కన్నుమూశాక కఠినంగా గడిచింది. మా కుటుంబం, అమ్మతో మాట్లాడాకే విశ్వాసం వచ్చింది. టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలన్న నా తండ్రి కల నెరవేర్చడంపైనే దృష్టి సారించా’ అని అతడు తెలిపాడు.

ఇవీ చదవండి
ప్చ్‌.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్‌!
తలకు కుట్లు పడ్డా.. బ్యాటింగ్‌ చేసిన సుందర్‌

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని