ఎంపీ రఘురామ, టీవీ5 ఛైర్మన్‌పై ప్రధానికి వైకాపా ఫిర్యాదు - ycp mps complaint against mp raghurama and tv5 chairman
close
Published : 27/07/2021 01:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎంపీ రఘురామ, టీవీ5 ఛైర్మన్‌పై ప్రధానికి వైకాపా ఫిర్యాదు

దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడుపై వైకాపా ఎంపీలు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్టు విజయసాయిరెడ్డి నేతృత్వంలో 15మంది ఎంపీల బృందం ఫిర్యాదులో పేర్కొంది. మిలియన్‌ యూరోలు బదిలీ జరిగినట్టు వైకాపా ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్‌, ఫెమా చట్టాల కింద విచారణ జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. 

అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా వైకాపా ఎంపీలు కలిశారు. పోలవరం, ప్రత్యేక హోదాపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమెను కోరారు. పోలవరం తుది డీపీఆర్‌కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల ప్రకారం భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి కలిపి రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ, టీఏసీలు ఆమోదం తెలిపాయని వివరించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని