సూర్యకుమార్‌ వల్లే కోహ్లీ-రోహిత్‌ జోడీ..! - zaheer khan explains why virat kohli could open with rohit sharma
close
Published : 22/03/2021 11:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సూర్యకుమార్‌ వల్లే కోహ్లీ-రోహిత్‌ జోడీ..!

మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌.. 

(Photo: BCCI Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ పూర్తయ్యాక టీమ్‌ఇండియా కొత్త చర్చకు తెరలేపింది. అదే రోహిత్‌ శర్మ- విరాట్‌ కోహ్లీ ఓపెనింగ్‌ కాంబినేషన్‌. ఎప్పుడూ లేని విధంగా వీరిద్దరూ ఐదో టీ20లో అనూహ్యంగా ఓపెనింగ్‌ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ వ్యూహాత్మక చర్య ఫలించడమే కాకుండా జట్టుకు కొత్త భరోసానిచ్చింది. మరోవైపు కెప్టెన్‌ కోహ్లీ సైతం భవిష్యత్‌లో హిట్‌మ్యాన్‌తో ఓపెనింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడంతో ఇప్పుడీ విషయంపై మరింత ఆసక్తి పెరిగింది.

అయితే, కోహ్లీ-రోహిత్‌ ఓపెనింగ్‌ చేయడానికి యువ బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవే ముఖ్య కారణమని టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ జహీర్‌ఖాన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన అతడు ఇలా స్పందించాడు. ఎవరైనా.. విరాట్‌ కోహ్లీ ఇలా వచ్చి అలా ఎలా ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని, అదెలా సాధ్యమని ముందుగా ప్రశ్నించుకోవాలని చెప్పాడు. దానికి సమాధానమే.. సూర్యకుమార్‌ యాదవ్‌ లాంటి యువబ్యాట్స్‌మన్‌ టీమ్ఇండియాకు దొరకడమని అన్నాడు. ఈ కొత్త కుర్రాడు మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేసి తానేం చేయగలడో నిరూపించాడన్నాడు.

ఈ ఆలోచనే కోహ్లీ ఓపెనింగ్‌ చేయడానికి ఉపకరించి ఉండొచ్చని, అది మంచి ఫలితం తీసుకురావడంతో కోహ్లీ కూడా రోహిత్‌తో కలిసి ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడన్నాడు. అలాగే నాలుగో స్థానంలో ఆడే శ్రేయస్‌ అయ్యర్‌ మరింత కిందకు వెళ్లాడని, ఇలాంటి పరిస్థితుల్లో ఓపెనింగ్‌ చేయడం మంచిదని కోహ్లీ భావించి ఉండొచ్చని జహీర్‌ చెప్పుకొచ్చాడు. కాగా, ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమ్‌ఇండియా.. సూర్యకుమార్‌, ఇషాన్‌కిషన్‌ లాంటి ఇద్దరు ముంబయి ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌కు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వారిద్దరూ సత్తా చాటి భవిష్యత్‌ ఆశాకిరణాలుగా నిలిచారు. మున్ముందు కూడా వారిద్దరు ఇలాగే ఆడితే, కోహ్లీ ఓపెనింగ్‌ చేయడం దాదాపు ఖాయమనే చెప్పాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని