close
టాలీవుడ్‌
అందుకే నగ్నంగా నటించా!

‘ఇద్దరమ్మాయిలతో’, ‘నాయక్‌’ చిత్రాలతో ఆకట్టుకుంది అమలా పాల్‌. అయితే ఆ తరవాత తెలుగులో ఎక్కువగా కనిపించలేదు. తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలకే పరిమితమైంది. ‘తెలుగు చిత్రసీమ నాకు రెండో ఇల్లు. ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలనుంది. మంచి అవకాశాల కోసం చూస్తున్నా’’ అంటోంది అమలా పాల్‌. తను నటించిన ‘ఆమె’ ఈ వారమే విడుదలవుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడింది అమలా పాల్‌. 

తెలుగులో చాలా విరామం వచ్చేసినట్టుంది? 
అవును. ఈమధ్య కొన్ని అవకాశాలు వచ్చాయి. కానీ నాకు నచ్చలేదు. అందుకే చేయలేదు. ఈలోగా మిగిలిన భాషల్లో కొత్త తరహా కథలు నాకు తారసపడ్డాయి. వాటితో బిజీ అయ్యాను. 
మీరు తెలుగులో సినిమా ఒప్పు కోవాలంటే ఏ అంశాలు ఉండాలి? 
కథానాయికగా నా పాత్ర కొత్తగా ఉండాలనుకుంటాను. కథ కొత్తగా లేకపోయినా సెట్లో ఏదో ఒకటి నేర్చుకునే అవకాశం ఉన్నా నేను నటించడానికి సిద్ధమే. ఒకే తరహా పాత్రలు చేస్తూ కూర్చుంటే నటిగా నేను ఎదగలేను. అలాగని నేను కమర్షియల్‌ చిత్రాలకు దూరం అనుకోవడానికి వీల్లేదు. ఆ తరహా కథలంటే నాకు ఇష్టమే. తెలుగులో నేను చేసిన సినిమాలు అవే కదా? కాకపోతే ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారింది. కథానాయిక అంటే తెల్లగా, అందంగా ఉండాలనే ధోరణికి అర్థం లేదిప్పుడు. ‘ఇద్దరమ్మాయిలతో’ తరవాత నాకొచ్చిన అవకాశాల్ని సరిగా ఉపయోగించుకోలేదు  అనిపిస్తోంది. ఆ సమయంలో కొన్ని తప్పటడుగులు వేశాను. మెల్లమెల్లగా నేర్చుకున్నాను. ఇప్పుడు ఎలాంటి సినిమాల్లో  నటించాలన్న విషయంలో నాకంటూ ఓ స్పష్టత ఉంది.

ఓ సన్నివేశంలో నగ్నంగానూ  నటించారు కదా? అంత ధైర్యం ఎందుకు చేశారు? 
కథ డిమాండ్‌ చేసింది. కావాలని  ఇరికించిన సన్నివేశం కాదు. స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు నేను షాక్‌కి గురయ్యాను. దర్శకుణ్ని పిలిచి మాట్లాడాను. ఆ    సన్నివేశం ఎంత  అవసరమో తను  వివరించాడు. నటిగా నాకు సవాల్‌గా అనిపించింది. అందుకే నగ్నంగా నటించే ధైర్యం చేయగలిగాను.

నయనతార, సమంత లాంటి వారు నాయికా ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేస్తున్నారు. మీరూ అదే బాటలో నడుస్తారా? 
వాళ్లకు మంచి పాత్రలు వస్తున్నాయి. మంచి కథల్ని ఎంచుకుంటున్నారు. నాకూ ఆ తరహా సినిమాలు చేయాలని ఉంది. కథని నడిపించే పాత్రలొక్కటే కాదు. ఆ కథలో  భాగమున్న మంచి పాత్రలైనా చేయడానికి నాకు ఎలాంటి  అభ్యంతరం లేదు. ఈమధ్య ‘మహానటి’, ‘ఓ బేబీ’ సినిమాలు చూశా. బాగా నచ్చాయి. 
‘ఆమె’లో మీరు కోరుకున్న అన్ని అంశాలూ ఉన్నాయా? 
పుష్కలంగా ఉన్నాయి. ఈ మధ్య చాలా కథలు విన్నా. ఏవీ నాలో ఉత్సాహం నింపలేదు. కానీ ‘ఆమె’ కథ వినగానే ‘తప్పకుండా చేయాలి’ అనిపించింది. సాంకేతికంగానూ ఈ సినిమా ఉన్నతంగా ఉంటుంది. లైవ్‌ సౌండ్‌ టెక్నాలజీతో సినిమా పూర్తి చేశాం. దాంతో డబ్బింగ్‌ చెప్పే అవసరం తప్పింది. ప్రతి మాట, ప్రతి స్పందన నిజాయతీగా కనిపిస్తాయి. 
బాగా సన్నబడినట్టున్నారు.. ఈ పాత్ర కోసమేనా? 
అవును. నాకు జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేయడం ఇష్టం ఉండదు. యోగా  చేస్తుంటాను. శాకాహారిని. కాబట్టి బరువు తగ్గడం కష్టమనిపించలేదు. 
నిర్మాతగానూ మారుతున్నారట? 
తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమా చేస్తున్నా. చాలా కొత్త కథ అది. ఆ కథ కోసమే నిర్మాతగా మారాను. అయితే దర్శకత్వ ఆలోచనలు మాత్రం లేవు.


తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.