close
హాలీవుడ్
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆయన జీతం నిమిషానికి మిలియన్‌ డాలర్లు!

లాస్‌ఏంజెల్స్‌: చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ నచ్చే సూపర్‌ హీరోస్‌లో ‘స్పైడర్‌ మ్యాన్‌’ ఒకడు. హాలీవుడ్‌లో పుట్టినా భారతీయ ప్రేక్షకులకూ సుపరిచితుడే. ‘స్పైడర్‌మ్యాన్‌’ సిరీస్‌లో భాగంగా వచ్చిన సినిమా ‘స్పైడర్‌ మ్యాన్‌: హోమ్‌ కమింగ్‌’. జాన్‌వాట్స్‌ దర్శకత్వం వహించారు. 2017లో వచ్చిన ఈ సినిమాలో నటుడు టామ్‌ హొలాండ్‌ తొలిసారి స్పైడర్‌మ్యాన్‌గా కనిపించారు. ఈ సినిమాలో అతిథి పాత్రకు ప్రముఖ హాలీవుడ్‌ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్‌ను తీసుకున్నారు. ఆయన ఫేం సినిమాకు మరింత బలమవుతుందనే దర్శక, నిర్మాతలు భావించారు.

అయితే ఈ సినిమాకు రాబర్ట్‌ 15 మిలియన్‌ డాలర్లు పారితోషికంగా తీసుకున్నట్లు తాజాగా తెలిసింది. అంతేకాదు ఆయన కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేశారు. అంటే రోజుకు 5 మిలియన్‌ డాలర్లన్నమాట. ఈ సినిమాలో రాబర్ట్‌ కేవలం 15 నిమిషాలు మాత్రమే కనిపించారు. దీని ప్రకారం.. ఒక్క నిమిషానికి ఆయన జీతం ఒక్క మిలియన్‌ డాలర్లు (అప్పటి లెక్కల ప్రకారం రూ.6 కోట్లకంటే ఎక్కువ) కావడం విశేషం. దాదాపు 175 మిలియన్‌ డాలర్లతో ‘స్పైడర్‌ మాన్‌: హోమ్‌ కమింగ్‌’ సినిమాను తెరకెక్కించారు. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: ఫార్‌ ఫ్రమ్‌ హోమ్‌’ సినిమాను 165 మిలియన్‌ డాలర్లతో నిర్మించారు. రాబర్ట్‌ ఇందులో లేకపోవడం వల్లే బడ్జెట్‌ తగ్గిందట. 2019లో వచ్చిన ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’లో రాబర్ట్‌ ఐరన్‌మ్యాన్‌గా మెప్పించారు. దీని తర్వాత ఆయన ‘బ్లాక్‌ విడో’లో కనిపించనున్నట్లు సమాచారం.


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.