రజనీ ‘రోబో’ను ఇలా షూట్‌ చేశారు! - Behind the story of rajinikanth robo movie
close
Published : 04/10/2020 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ ‘రోబో’ను ఇలా షూట్‌ చేశారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: రజనీకాంత్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘రోబో’. శంకర్‌ టేకింగ్‌, రోబోగా రజనీ నటన, ఐశ్వర్యరాయ్‌ అందం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక చిట్టిగా రోబో పాత్రలో రజనీ నటన అందరినీ అలరించింది. ఇక క్లైమాక్స్‌ సీక్వెన్స్‌ ఒళ్లుగగురుపొడిచేలా చేశాయి. 2010లో విడుదలైన ఈ సినిమా ఇటీవలే పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ఓ ఆసక్తికర వీడియోను పంచుకుంది. రోబోను తయారు చేయడం, ట్రైన్‌లో ఫైట్‌ సీన్‌, మంటల్లో చిక్కుకున్న అమ్మాయిని కాపాడే సన్నివేశం మొదలైన వాటిని ఎలా చిత్రీకరించారో అందులో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ ఆసక్తికర వీడియోను మీరూ చూసేయండి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని