ఐ మిస్‌ యూ సుధీర్‌: రష్మి - Dhee 13 Latest Promo
close
Published : 16/12/2020 04:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఐ మిస్‌ యూ సుధీర్‌: రష్మి

ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’, ‘ఢీ’ షోలతో సుధీర్‌-రష్మి జోడీ ప్రేక్షకులకు చేరువైన విషయం తెలిసిందే. యూట్యూబ్‌ జోడీగా పేరు తెచ్చుకున్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ చాలా సందర్భాల్లో వార్తలు వచ్చినప్పటికీ తాము మాత్రం మంచి స్నేహితులమేనని సమాధానమిచ్చారు. కాగా, తాజాగా రష్మి ఓ షోలో సుధీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఐ మిస్‌ యూ సుధీర్‌’ అని చెప్పారు.

ఈటీవీలో ప్రసారమయ్యే డ్యాన్స్‌ రియాల్టీ షో ‘ఢీ’. ఇటీవల ఈ షో 12వ సీజన్‌ ‘ఢీ ఛాంపియన్స్‌’ విజయవంతంగా ముగిసిన విషయం తెలిసిందే. దీంతో, తాజాగా ‘కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌’ అనే కాన్సెప్ట్‌తో ‘ఢీ 13’ ప్రారంభం కానుంది. శేఖర్‌ మాస్టర్‌, ప్రియమణి, పూర్ణ న్యాయనిర్ణేతలుగా, హైపర్‌ ఆది-సుధీర్‌, రష్మి-దీపిక పిల్లై టీమ్‌ లీడర్లుగా.. ఈ షో రానుంది. గత కొన్ని సీజన్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్న ప్రదీప్‌.. ఈ సీజన్‌కూ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.

కాగా, తాజాగా ‘ఢీ 13’ సరికొత్త ప్రోమో విడుదలయ్యింది. ఇందులో సుధీర్‌, రష్మి, దీపిక, ఆది, ప్రదీప్‌ అందరూ కలిసి డ్యాన్స్‌ చేస్తూ కనిపించారు. అనంతరం ప్రదీప్‌ మాట్లాడుతూ.. ‘సెలబ్రేషన్స్‌ ఎంత బాగున్నాయో చూడండి. ఈ రౌండ్‌లో ఎవరు గెలిచారో ఎవరికీ తెలీదు’ అని అనగానే.. ‘కాదు ప్రదీప్‌.. ఎంత పోటీ ఉన్నాసరే అందరం కలిసి డ్యాన్స్‌ చేస్తే వచ్చే కిక్కే వేరు’ అని రష్మి సమాధానమిచ్చారు. అనంతరం ఆమె.. సుధీర్‌ గురించి మాట్లాడుతూ.. ‘ఏది ఏమైనా సుధీర్‌.. నిన్ను కొంచెం మిస్‌ అవుతున్నా’ అంటూ నవ్వులు పూయించారు. ‘నిన్ను తరచూ మిస్‌ అవుతూనే ఉంటాను నా అదృష్ట దేవత’ అని వెంటనే సుధీర్‌ బదులిచ్చారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. యూట్యూబ్‌ ట్రెండింగ్‌లోనూ దూసుకెళ్తోంది. వచ్చే బుధవారం డిసెంబర్‌ 16న ప్రసారం కానున్న ‘ఢీ 13’ ప్రోమో చూసేయండి..!

ఇవీ చదవండి

అందుకే పాస్టర్‌గా మారాల్సి వచ్చింది: రాజా

భళ్లాలదేవుడిలో ఎన్నెన్ని కళలో.. మీకివి తెలుసా?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని