కొత్తగా మరొకటి అంగీకరించారా? - Nithiin and Vakkantham Vamsi team up for new project
close
Published : 03/05/2021 19:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తగా మరొకటి అంగీకరించారా?

చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఈ ఏడాది ఇప్పటికే ‘చెక్‌’, ‘రంగ్‌ దే’ చిత్రాలతో ప్రేక్షకుల్ని పలకరించిన ఆయన.. ఇప్పుడు ‘మ్యాస్ట్రో’గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది సెట్స్‌పై ఉండగానే ఆయన మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారని సమాచారం. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రంతో దర్శకుడిగా మారారు రచయిత వక్కంతం వంశీ. ఇప్పుడాయన దర్శకత్వంలోనే నితిన్‌ ఓ సినిమా చేసేందుకు అంగీకారం తెలిపారని సమాచారం.

దీన్ని ఠాగూర్‌ మధు నిర్మించనున్నారు. ఓ విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందనుందని, ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు తుది దశకు చేరుకున్నాయని చెబుతున్నారు. కథానాయికగా సాయిపల్లవి పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం నితిన్‌ చేస్తున్న ‘మ్యాస్ట్రో’ పూర్తి కాగానే.. ఈ కొత్త చిత్రం పట్టాలెక్కనుందని సమాచారం. ఇక ఆయన ఇప్పటికే ‘పవర్‌ పేట’ అనే మరో సినిమాకీ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని