హైదరాబాద్: వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ముఖ్యంగా వైష్ణవ్, కృతి, విజయ్ సేతుపతిల నటన బుచ్చిబాబు టేకింగ్ సినిమాను విజయపథంలో నడిపాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి.
ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ‘ఉప్పెన’ టీమ్‌ను అభినందించడంతో పాటు, సర్ప్రైజ్ గిఫ్ట్‌లు పంపారు. ఈ విషయాన్ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అభిమానులతో పంచుకున్నారు. ‘‘డియర్ డీఎస్పీ ఎగసిపడిన ఈ ఉప్పెన విజయానికి నీ సంగీతం ఆయువు పట్టు. స్టార్ చిత్రాలకు ఎంత ప్యాషన్‌తో సంగీతం అందిస్తావో.. చిత్రం రంగంలోకి ప్రవేశిస్తున్న కొత్త టాలెంట్‌కు అంతే ప్యాషన్‌తో మ్యూజిక్‌ను ఇస్తావు. నీలో ఉండే ఈ ఎనర్జీ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటూ, నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నువ్వు నిజంగా రాక్ స్టార్.. ప్రేమతో మీ చిరంజీవి’’ అని చిరు పంపిన లెటర్‌ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా చిరంజీవికి దేవిశ్రీ కృతజ్ఞతలు తెలిపారు. కథానాయిక కృతిశెట్టి, దర్శకుడు బుచ్చిబాబు, మైత్రీ మూవీ మేకర్స్ తదితరులకు చిరు గిఫ్ట్‌లు పంపారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’