Today Horoscope: ఈ రోజు రాశి ఫలం - daily horoscope for 22-06-21
close
Published : 22/06/2021 04:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Today Horoscope: ఈ రోజు రాశి ఫలం

 - డాక్టర్‌ శంకరమంచి శివసాయి శ్రీనివాస్

మొదలుపెట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. శత్రువుల జోలికి పోకూడదు. మనోబలాన్ని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. దుర్గారాధన మేలు. 

ముఖ్యమైన విషయాల్లో ఫలితాలు అనుకూలంగా వస్తాయి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. పనులు తలపెట్టే ముందు పెద్దల సలహాలు తీసుకోవాలి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

ధర్మసిద్ధి ఉంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. వివాదాలకు పోకూడదు. ఇష్ట దైవారాధన మంచిది.

పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. ఉద్యోగ రంగానికి చెందిన వారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. శివనామాన్ని జరిపించాలి.

చంచల స్వభావాన్ని రానీయకండి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. వ్యాపారంలో కొన్ని కీలక నిర్ణయాలు  తీసుకుంటారు. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడం మంచిది. 

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. నచ్చినవారితో కాలాన్ని గడుపుతారు. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. శివనామాన్ని జరిపించాలి.

సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. సమస్యలున్నప్పటికీ ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. ఆందోళన కలిగించే సంఘటనలను మదిలోకి రానీయకండి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మంచినిస్తాయి. ఇష్ట దైవారాధన మేలు.

బంధుమిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. మంచి ఆలోచనతో చేసే పనులు విజయాన్నిస్తాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.

మిశ్రమ ఫలితాలున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఆవేశానికి పోకూడదు. శని శ్లోకం చదవాలి.

మీ మీ రంగాల్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. గణపతిని పూజిస్తే మంచిది.  

బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. దుర్గాదేవిని సందర్శస్తే మంచిది.

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తోటివారితో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. అనవసర కలహాలకు తావులేకుండా చూసుకోవాలి. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని