జైరాజ్‌ జీవితం స్ఫూర్తిదాయకం - Telugu News Srinivas Goud At Paidi Jairaj 112 birth anniversary
close
Updated : 29/09/2021 07:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జైరాజ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

నటుడిగా... దర్శకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమపై తనదైన ముద్రవేసిన పైడి జైరాజ్‌ జీవితం నేటి తరాలకి స్ఫూర్తిదాయకమన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. చలనచిత్ర వాణిజ్య మండలి ఆవరణంలో జైరాజ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం పైడి జైరాజ్‌ 112వ జయంతి వేడుకల్ని నటుడు జైహింద్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి.. జైరాజ్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘ఎన్నో కష్టనష్టాలకోర్చి బాలీవుడ్‌లో హీరోగా ఎదిగి, ఆ తర్వాత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు అందుకున్నారు పైడి జైరాజ్‌. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుగు పరిశ్రమలో ఎక్కువగా తెలియకపోవడం ఆశ్చర్యం. ఆయన జ్ఞాపకార్థం రవీంద్రభారతిలో హాల్‌ని ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం’’ అన్నారు. ‘‘మూకీల సమయంలోనే హీరోగా ఎదిగి, 1980లోనే ఫాల్కే పురస్కారం అందుకున్న పైడి జైరాజ్‌ని తెలుగు పరిశ్రమ మరిచిపోయింది’’ అన్నారు జైహింద్‌ గౌడ్‌. కార్యక్రమంలో కంకణాల శ్రీనివాస్‌రెడ్డి, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని