శ్రీవిష్ణు కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకుడు. ఎస్.క్రిష్ణ నిర్మాత. నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. లవ్లీ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకగా మార్చి 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఆదివారం ప్రకటించింది. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘అందర్నీ అలరించే వెరైటీ సినిమా ఇది. ఈ చిత్రానికి నేను స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తూ.. సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నా’’ అన్నారు. ‘‘కొత్తదనం ఉన్న మంచి సినిమా ఇది. నేనిప్పటి వరకు చేయని ఓ విభిన్నమైన పాత్ర ఈ చిత్రంలో పోషించా. వినోదంతో పాటు మదిని తాకే చక్కటి భావోద్వేగాలు ఉన్నాయ’’న్నారు రాజేంద్ర ప్రసాద్. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. ‘‘మార్చి 11న కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి థియేటర్లలో సిద్ధంకండి’’ అన్నారు. ‘‘మా ‘గాలి సంపత్’ అందరికీ వినోదం పంచుతుంద’’న్నారు దర్శకుడు అనీష్. ‘‘తుది షెడ్యూల్లో ఉంది. డబ్బింగ్ పనులు మొదలు పెట్టాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్.
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్!
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
శాకుంతల.. దుష్యంతుడు
-
‘శ్రీకారం’.. ట్రైలర్ వచ్చేసింది
గుసగుసలు
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!