రాశిఖన్నా కొత్త కబుర్లు వినిపిస్తోంది. మలయాళం సినిమాకి సంబంధించిన కబురు ఒకటి కాగా... తెలుగులో మరోసారి సాయితేజ్‌తో జోడీ కట్టనున్న సంగతి మరొకటి. రాశిఖన్నాకి తెలుగుతోపాటు మలయాళంలోనూ మంచి గుర్తింపు ఉంది. తాజాగా మరో కీలక అవకాశం ఆమె సొంతమైంది. హిందీలో విజయవంతమైన ‘అంధాదున్’ మలయాళంలో రీమేక్ అవుతోంది. అక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవి.కె.చంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది. హిందీలో రాధికా ఆప్టే చేసిన పాత్ర అది. తెలుగులో ‘ప్రతిరోజూ పండగే’ తర్వాత మరోసారి సాయి తేజ్‌తో ఆమె జోడీ కట్టనున్నట్టు తెలుస్తోంది. తేజ్ ప్రస్తుతం చేస్తున్న దేవాకట్టా సినిమా తర్వాత, సుకుమార్ రైటింగ్స్, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఓ చిత్రం చేయనున్నారు. అందులో కథానాయికగా రాశిఖన్నానే ఎంపికైందని సమాచారం. దక్షిణాది భాషల్లోనే కాదు, హిందీలోనూ షాహిద్ కపూర్‌తో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయడానికి పచ్చజెండా ఊపేసింది రాశి. అక్కడ ఇక్కడా అని కాకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ సై అంటూ జోరు ప్రదర్శిస్తోంది.
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ