దీపావళికి ‘సూర్యవంశీ’
close
Published : 21/10/2021 04:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దీపావళికి ‘సూర్యవంశీ’


క్షయ్‌ కుమార్‌ హీరోగా రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సూర్యవంశీ’. శక్తిమంతమైన పోలీస్‌ కథాంశంతో రూపొందింది. కత్రినా కైఫ్‌ కథానాయిక. రణ్‌వీర్‌ సింగ్‌, అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే సినీప్రియుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి మహారాష్ట్రలో పూర్తిస్థాయిలో థియేటర్లు తెరచుకుంటున్న నేపథ్యంలో.. చిత్ర బృందం విడుదల విషయమై స్పష్టత ఇచ్చింది. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా నవంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని అక్షయ్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియజేశారు. గురువారం ఈ సినిమా నుంచి ‘‘అయిలా రే అయిలా’’ అనే గీతాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను అభిమానులతో పంచుకున్నారు. ఈ పాటలో అక్షయ్‌, రణ్‌వీర్‌, అజయ్‌ కలిసి ఆడిపాడారు. ఈ సినిమాని దేశవ్యాప్తంగా దాదాపు 3వేల వరకు స్క్రీన్‌లలో ప్రదర్శించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని