కాళ్లు చేతులు కట్టి..తుప్పల్లో పడేశారు
ముగ్గురు ఎత్తుకెళ్లారని డిగ్రీ విద్యార్థిని ఆరోపణ
నేడు వివరాలు చెబుతాం: పోలీసులు
గుర్ల/నేరవార్తవిభాగం, న్యూస్‌టుడే: విజయనగరం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని కాళ్లు, చేతులు కట్టేసి తుప్పల్లో పడేసిన సంఘటన గంటకో మలుపు తిరుగుతోంది. తన బాబాయి ఇంటికి వెళ్తానని శుక్రవారం కళాశాల నుంచి బయల్దేరిన ఆమెను ఎవరు తీసుకొచ్చి పడేశారనేది మిస్టరీగా మారింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెకు స్పృహ రావడంతో... విచారణలో పోలీసులకు కొన్ని వివరాలను వెల్లడించిందని సమాచారం. ‘నేను బాబాయి ఇంటికి వెళ్లకుండా నేరుగా తెర్లాంకు ఆటోలో బయలుదేరా. అప్పటికే అందులో ముగ్గురు అబ్బాయిలు ఉండగా దిగిపోదామనేసరికి వారు బలవంతంగా నన్ను మరో క్యాబ్లోకి ఎక్కించారు. రెండు రోజులు వారితో ఉంచుకొని సోమవారం ఉదయం గుర్ల దగ్గర తుప్పల్లో చేతులు, కాళ్లు కట్టేసి పడేసి వెళ్లిపోయారు’ అని వివరించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మంగళవారం వెల్లడయ్యే అవకాశాలున్నాయని పోలీసులు చెప్పారు.
అరుపులు వినిపించడంతో...
సోమవారం ఉదయం గుర్ల పోలీసు ఠాణా సమీపంలోని పొదల్లో నుంచి అరుపులు వినిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఎస్ఐ లీలావతి, సిబ్బంది అక్కడకు చేరుకొని అక్కడ ఓ యువతి పడి ఉండడంతో ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఎస్పీ రాజకుమారి, డీఎస్పీ అనిల్ కుమార్, సీఐ మంగవేణి ఘటనా స్థలాన్ని సందర్శించారు. క్లూస్ టీం, పోలీసు జాగిలాలు పరిసర ప్రాంతాలను పరిశీలించాయి. విచారణలో భాగంగా ఆమె విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్న తెర్లాం మండలానికి చెందిన విద్యార్థినిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అదనపు ఎస్పీ ఎన్.శ్రీదేవిరావు విలేకర్లకు తెలియజేశారు. ఆ విద్యార్థిని ఘటనా స్థలానికి ఏ విధంగా చేరుకుంది? ఎవరు తీసుకొచ్చారనే విషయాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం ఆమె ఘోషాసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆరోగ్యం బాగానే ఉన్నా... షాక్‌లోనే ఉందన్నారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని... అయినా కేసును సుమోటోగా స్వీకరించి రెండు బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ‘శుక్రవారం తరగతి గదిలో ఆ విద్యార్థిని పడిపోయింది. వెంటనే తల్లిదండ్రులకు సమాచారం అందించాం. విజయనగరంలోనే ఉంటున్న తన బంధువుతో కలిసి ఆసుపత్రికి వెళ్లి సోమవారం వస్తానని చెప్పి వెళ్లింది. అయితే ఆదివారం ఆమె తన ఇంటికి చేరుకోలేదని ఫోను వచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది’ అని వివరించారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
బన్ని- కొరటాల కాంబో: స్పందించిన నిర్మాత
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
-
తెలుగు డైలాగ్‌తో అలరిస్తోన్న మోహన్ లాల్
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
గుసగుసలు
- ఎన్టీఆర్ సరసన కియారా?
-
మే మూడోవారంలో ఓటీటీలో ‘వైల్డ్ డాగ్’ విడుదల?
- దీపావళి రేసులో రజనీ, కమల్
-
కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్!
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
రివ్యూ
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
-
రివ్యూ: తెల్లవారితే గురువారం
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం
-
‘ఉప్పెన’ ధక్ ధక్ ఫుల్ వీడియో సాంగ్ చూశారా