Ivermectin: వారిలో మరణాలు తక్కువే
close
Published : 13/05/2021 07:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Ivermectin: వారిలో మరణాలు తక్కువే

ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

ఈనాడు, దిల్లీ: సాధారణ వైద్యం పొందిన కొవిడ్‌ బాధితులతో పోల్చితే... ‘ఐవర్‌మెక్టిన్‌’ తీసుకున్నవారిలో మరణాలు తక్కువేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ‘థెరపెటిక్‌, కొవిడ్‌-19 లివింగ్‌ గైడ్‌లైన్స్‌’లో ఈ విషయాన్ని పేర్కొంది. సాధారణ వైద్యం పొందినవారు, ఐవర్‌మెక్టిన్‌ తీసుకున్న వారిపై నిర్వహించిన పరీక్షల్లో కనిపించిన తేడాలను నివేదికలో పొందుపరిచింది. అయితే ఈ సంస్థ ఎక్కడా ఐవర్‌మెక్టిన్‌ ద్వారా మంచి ఫలితాలు ఉంటాయని మాత్రం పేర్కొనలేదు. పైగా, దీనివల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది. ఐవర్‌మెక్టిన్‌ చికిత్స పొందినవారిలో 56% తక్కువగా మరణాలు ఉన్నప్పటికీ... డబ్ల్యూహెచ్‌వో మాత్రం మరణాలపై దీని ప్రభావం అనిశ్చితిగానే ఉన్నట్లు పేర్కొంది! మెకానికల్‌ వెంటిలేషన్‌ అవసరమయ్యేవారి సంఖ్య కూడా అస్పష్టమేనని తెలిపింది. ఆసుపత్రుల్లో, ఇళ్లల్లో చికిత్స పొందుతున్న మొత్తం 2,407 మంది కొవిడ్‌ బాధితులపై అధ్యయనం నిర్వహించింది. దీని ప్రకారం- మెకానికల్‌ వెంటిలేషన్‌, ఆసుపత్రుల్లో చేరిక, అక్కడ ఉండాల్సిన సమయం, వైరస్‌పై పైచేయి సాధించడానికి పట్టే సమయం, మరణాలు వంటి అంశాలన్నింటిలో ఫలితాలు, ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. అందువల్లే ఐవర్‌మెక్టిన్‌ను క్లినికల్‌ ట్రయల్‌ కోణంలో తప్ప మిగతా సందర్భాల్లో ఉపయోగించడానికి సిఫార్సు చేయడంలేదని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని