భావితరాల కోసమే వాననీళ్లు
close
Published : 26/07/2021 04:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భావితరాల కోసమే వాననీళ్లు

వాటి సంరక్షణ అందరి బాధ్యత

దేశ ప్రజలకు ప్రధాని పిలుపు

ఈనాడు, దిల్లీ: వర్షపునీరు ఉన్నది భవిష్యత్తు తరాల కోసమేనని, ఒడిసిపట్టి సంరక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం ద్వారా దేశప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టోక్యో ఒలింపిక్స్‌, 75వ స్వాతంత్య్ర దినోత్సవం, స్వదేశీ వస్తువుల వినియోగం లాంటి పలు విషయాల్లో దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసిన ఆయన అంతిమంగా వాననీటి సంరక్షణ గురించి ప్రత్యేక ఉద్బోధ చేశారు. ‘‘వాన నీటి సంరక్షణ నా మనసుకు నచ్చిన అంశం. నా బాల్యం గడిచిన ప్రాంతంలో నీటికి కొరత ఉండేది. మేం  ఎప్పుడూ వర్షం కోసం తపించేవాళ్లం. ప్రతి వర్షపు నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవడం మన సంస్కృతిలో భాగంగా మారింది. ప్రజాభాగస్వామ్యంతో జల సంరక్షణ అన్న నినాదం ఇప్పుడు పరిస్థితులను సంపూర్ణంగా మార్చింది. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించడం, నీటి వృథాని అరికట్టడం మన జీవనశైలిలో ఒక అంతర్భాగం కావాలి. మన కుటుంబ సభ్యుల్లోనూ ఇదో సంస్కృతిగా మారాలి. అది ప్రతి కుటుంబసభ్యుడికీ గర్వకారణం కావాలి. ప్రకృతి, పర్యావరణ సంరక్షణ భారతీయ సాంస్కృతిక జీవనం, దైనందిన జీవితంలో అంతర్భాగం. ఆ వానలు, వర్షాకాలాలే మన ఆలోచనలు, మన సిద్ధాంతం, నాగరికతకు ఎప్పుడూ సరికొత్తరూపాన్ని ఇస్తుంటాయి. వర్షాకాలం కేవలం అందంగా, ప్రశాంతంగా ఉండటమేకాదు, అది పృథ్వికి పోషణ, జీవననాన్ని ఇస్తుంది. వర్షం రూపంలో మనకు అందే నీళ్లు భవిష్యత్తు తరాల కోసం అన్న విషయాన్ని మనం ఎప్పుడూ మరిచిపోకూడదు’’ అని ప్రధాని పిలుపునిచ్చారు.

‘భారత్‌ జోడో ఆందోళన్‌’లో పాల్గొనండి

స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ‘దేశం ప్రథమం, అన్ని వేళలా ప్రథమం’ అన్న స్ఫూర్తితో ముందుకు కదలాలని ప్రధాని కోరారు. మహత్మాగాంధీ చేపట్టిన క్విట్‌ ఇండియా ఉద్యమం తరహాలోనే ఇప్పుడు ‘భారత్‌ జోడో ఆందోళన్‌’ (ఐక్య భారత ఉద్యమం) కొనసాగించాలని సూచించారు. అధిక సంఖ్యలో ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించాలని, ఇందుకు కేంద్ర సాంస్కృతిక శాఖ http://rashtragan.in అనే వెబ్‌సైట్‌ను రూపొందించిందని తెలిపారు. దేశ ఒలింపిక్‌ క్రీడాకారులను ప్రోత్సహించడానికి సామాజిక మాధ్యమంలో చేపట్టిన ‘విక్టరీ పంచ్‌ క్యాంపెయిన్‌’లో పాల్గొనాలని కోరారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని