రిషీ సునక్‌, ప్రీతి పటేల్‌ పదవులు పదిలం
close
Updated : 16/09/2021 07:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రిషీ సునక్‌, ప్రీతి పటేల్‌ పదవులు పదిలం

బ్రిటన్‌ మంత్రివర్గంలో కీలక మార్పులు

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మంత్రివర్గంలో బుధవారం కీలక మార్పులు చేశారు. అయితే భారత సంతతికి చెందిన ఇద్దరు సీనియర్‌ మంత్రులను మాత్రం వారి పదవుల్లోనే కొనసాగిస్తూ నిర్ణయించారు. ఈమేరకు రిషీ సునక్‌కు బ్రిటన్‌ కేబినెట్‌లో అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రి (ఛాన్సిలర్‌ ఆఫ్‌ ది ఎక్స్‌చెకర్‌) పదవిని పదిలంగా ఉంచారు. మరో మంత్రి ప్రీతి పటేల్‌కు ఈసారి స్థానచలనం ఉంటుందన్న ఊహాగానాలు వినిపించినప్పటికీ ఆమెను.. తాను నిర్వహిస్తున్న కీలకమైన హోం శాఖలోనే కొనసాగించారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి రిషీ సునక్‌ ఆ పదవిలోనే కొనసాగుతున్నారు. సీనియర్‌ మంత్రుల్లో కీలకమైన విదేశాంగ శాఖను నిర్వహిస్తున్న డొమినిక్‌ రాబ్‌ స్థాయిని తగ్గిస్తూ.. కొత్త న్యాయశాఖకు మార్చారు. ఇటీవలి ఆఫ్గాన్‌ పరిణామాల్లో కాబూల్‌ నుంచి దేశస్థుల తరలింపు వంటి వ్యవహారాల్లో విదేశాంగ శాఖ మంత్రిగా రాబ్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లోనే ఆయన భవితవ్యంపై ఊహాగానాలు చెలరేగాయి. తాజాగా ఆయన స్థానంలో అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా ఉన్న లిజ్‌ ట్రస్‌కు పదోన్నతి కల్పించడం వంటి మార్పులను జాన్సన్‌ చేపట్టారు. అంతకుముందు బ్రిటన్‌ ప్రధాని తన టాప్‌ టీమ్‌లో మార్పులు చేస్తారని.. గట్టి, సమైక్య బృందాన్ని తయారు చేస్తారని డౌనింగ్‌ స్ట్రీట్‌ ప్రకటించింది. కాగా దిగువస్థాయి మంత్రుల్లో మార్పుల ప్రక్రియను ప్రధాని గురువారం ఖరారు చేస్తారని తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని