హైదరాబాద్: పూజాహెగ్డేను చూసి అఖిల్ ఫిదా అయ్యారు. ఆమె సౌందర్యాన్ని చూస్తూ.. మాటల్ని వింటూ నవ్వుతూ అలాగే నిల్చుండిపోయారు. అయితే ఇదంతా కేవలం సినిమాలో మాత్రమే. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ స్పెషల్ సర్ప్రైజ్ విడుదలయ్యింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ‘గుచ్చే గులాబిలాగా’ అంటూ సాగే ఓ పాటను చిత్రబృందం సినీప్రియులతో పంచుకుంది. ఇప్పటికే విడుదలైన ‘మనసా మనసా’ పాట ప్రేక్షకుల్ని అలరిస్తోన్న నేపథ్యంలో ఇప్పుడు విడుదలైన సరికొత్త పాట కూడా హృదయాలను హత్తుకునేలా ఉంది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ‘గుచ్చే గులాబిలాగా’ పాటను అర్మాన్మాలిక్ అలపించారు. జూన్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవీ చదవండి
రాజమౌళి మాట నమ్మాలనుకోవడం లేదు
సుమంత్ పెళ్లి వేడుకలు షురూ!
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
రెండోసారి.. పంథా మారి
-
#RRR క్లైమాక్స్ కోసం నిక్ పావెల్ వచ్చేశాడు
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!