close
Published : 27/02/2021 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

థియేటర్లు దద్దరిల్లేలా నవ్వటం ఖాయం..!

హైదరాబాద్‌: సినిమా విడుదల లేటైనా థియేటర్‌లో జనాలు విరగబడి నవ్వటం ఖాయం అంటున్నారు హీరో నవీన్‌ పోలిశెట్టి. ఆయన ప్రధాన పాత్రలో అనుదీప్‌ కె.వి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతి రత్నాలు’. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణన్‌ కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో చిత్రబృందం సినిమా విశేషాలను పంచుకుంది. ముందుగా హీరో నవీన్‌ పోలిశెట్టి మాట్లాడుతూ ‘నేను ఏ చిత్రంలో నటించిన దాన్ని కన్నబిడ్డలా భావిస్తాను. హీరోగా నా మొదటి చిత్రం ‘ఏజెంట్‌..’ మొదటి బిడ్డ అయితే, రెండో బిడ్డ ‘చిచ్చోరే’. రెండు చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాగే నా మూడో బిడ్డ ‘జాతి రత్నాలు’ లాక్‌డౌన్‌ కారణంగా డెలివరీ కొంచెం లేటైనా మిమ్మిల్ని కడుపుబ్బా నవ్వించడం ఖాయం. అనుదీప్‌ ఈ కథ వివరిస్తున్నప్పుడే పడిపడి నవ్వాను. చిత్ర బృందంలోని మిగతావారంతా అలాగే ఎంజాయ్‌ చేశారు.  ప్రతీ పాత్రలోను ఒక ప్రత్యేకత ఉంటుంది. హీరోయిన్‌గా ఫరీయా అబ్దుల్లా పాత్రకు పూర్తి న్యాయం చేసింది. మౌత్‌టాక్‌తోనే ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుందని నమ్మకం ఉంది. ప్రేక్షకులు థియేటర్లో అందరి మధ్య ఎంజాయ్‌ చెయ్యాలనే ఉద్దేశంతోనే ఓటీటీకి ఇవ్వలేదు. ఆ మజాను ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్‌ చేస్తారు’ అంటూ చెప్పుకొచ్చారు. 

నిర్మాత నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ ‘చాలా రోజుల తర్వాత ప్రెస్‌మీట్‌లో పాల్గొనటం సంతోషంగా ఉంది. ఈ సినిమా వ్యాపార లెక్కలేం వేసుకోలేదు. ప్రేక్షకులు మైమరిచి నవ్వాలనేదే మా ఉద్దేశం. ఎస్వీ కృష్ణారెడ్డి, ఈవీవీ, జంధ్యాల గారు నా అభిమాన దర్శకులు. వారిలాగానే ప్రేక్షకులను నవ్వించాలని ఈ ప్రయత్నం చేశాం. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ప్రియాంక, స్వప్న ప్రధాన కారణం. డైరెక్టర్‌ అనుదీప్‌ చాలా చక్కగా చిత్రాన్ని మలిచారు. తప్పని సరిగా చిత్రాన్ని థియేటర్లో చూడాలని కోరుకుంటున్నాను’ అంటూ ముగించారు.  హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ‘నాకిది మొదటి చిత్రంలా అనిపించలేదు. యూనిట్‌ సభ్యులంతా నాతో కలిసిపోయారు. అందరూ నన్ను చిట్టి..చిట్టి అని పిలుస్తున్నారు. థియేటర్లో మిమ్మల్ని నవ్వించడం పక్కా’అంటూ చెప్పుకొచ్చింది. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం రథన్‌ అందిస్తుండగా, సిద్ధం మనోహారో సినిమాటోగ్రఫీ చేశారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని