close
Published : 04/03/2021 13:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అందుకే బన్నీ మూవీ ఫంక్షన్స్‌కి రాను

నటుడు అల్లు శిరీష్‌

హైదరాబాద్‌: తన అన్నయ్య అల్లు అర్జున్‌ నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ మినహాయించి ఏ ఇతర సినిమా వేడుకలకు తాను హాజరు కాలేదని నటుడు అల్లు శిరీష్‌ తెలిపారు. తాజాగా ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి’ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. విభిన్న కథా చిత్రాలంటే తనకు ఎంతో ఆసక్తి అని ఆయన తెలిపారు. ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి’ ఓ మంచి కథాచిత్రమని.. దానిని ప్రోత్సహించాలని శిరీష్‌ సూచించారు.

‘‘గడిచిన పది సంవత్సరాలుగా నా సినిమా ఫంక్షన్స్‌ మినహాయించి ఏ ఇతర మూవీ వేడుకలకు హాజరు కాలేదు. కేవలం మా అన్నయ్య నటించిన ‘అల.. వైకుంఠపురములో’ ఫంక్షన్‌కు మాత్రమే వెళ్లాను. అది కూడా ఆ చిత్రానికి నాన్న నిర్మాత కాబట్టి. సినిమా ఫంక్షన్స్‌కు వెళ్లకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. అవన్నీ భారీ చిత్రాలు.. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నటుడ్ని.. కాబట్టి నేను, వెళ్లినా వెళ్లకపోయినా ఆ సినిమా వేడుకలు బాగానే జరుగుతాయి. ‘లవ్‌ లైఫ్‌ అండ్‌ పకోడి’తో చాలాకాలం తర్వాత ఓ సినిమా వేడుకకు వచ్చాను. కొత్త తరహా విభిన్న కథతో తెరకెక్కిన ఇలాంటి చిన్న చిత్రాలను సైతం ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ వేడుకకు వచ్చాను’’ అని శిరీష్‌ వివరించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని