close
Published : 24/02/2021 11:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏప్రిల్‌లో ‘చెహ్రీ’..

ముంబయి: లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి, వందశాతం సామర్థ్యంతో థియేటర్లు తెరవడానికి   అనుమతులివ్వడంతో బాలీవుడ్‌ విడుదల తేదీల ప్రకటనలతో ఊరిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌, ఇమ్రాన్‌ హష్మీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘చెహ్రీ’ ఏప్రిల్‌ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఆనంద్‌ పండిట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రూమి జెఫ్రీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను, విడుదల తేదీని ఇమ్రాన్‌ తన సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. మరోవైపు సైఫ్‌ అలీఖాన్‌, అర్జున్‌కపూర్‌, యామీ గౌతమ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటిస్తున్న ‘భూత్‌పోలీస్‌’ 2021 సెప్టెంబర్‌ 10న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీనికి దర్శకుడు పవన్‌ కిర్‌పలాణి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని