close
Published : 05/04/2021 14:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూర్య నారాయణ.. ‘101 జిల్లాల అందగాడు’

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రుహానీ శర్మ కథానాయిక.  టైటిల్‌ గీతాన్ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని అందగాళ్లని మించిన అందగాడు సూర్య నారాయణ అంటూ సరదాగా సాగుతుందీ పాట. భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింహ ఆలపించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దిల్‌రాజు - క్రిష్‌ సమర్పిస్తున్నారు. శిరీష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని