ప్రభాస్‌ ‘డార్లింగ్‌’కు 11ఏళ్లు - prabhas movie darling completes 11 years of release
close
Published : 24/04/2021 01:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ‘డార్లింగ్‌’కు 11ఏళ్లు

ఇంటర్నెట్ డెస్క్: ప్రభాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘డార్లింగ్‌’. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో రొమాంటిక్‌ ప్రేమకథాగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై  బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించారు. జీవీ ప్రకాష్ సంగీత స్వరాలు కూర్చారు. ఈ సినిమా విడుదలై శుక్రవారంతో 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ‘11YearsForDarling’’ అనే హ్యాష్‌ట్యాగ్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

చిత్ర కథేంటంటే: కొంతమంది స్నేహితులంతా ప్రతి పదేళ్లకొకసారి ఒకే చోట చేరి సరదాగా గడపాలనుకుంటారు. వీరిలో ఒకరు హనుమంత రావు (ప్రభు) మరొక స్నేహితుడు విశ్వనాథ్ (ఆహుతి ప్రసాద్). హనుమంతరావు కొడుకు ప్రభ (ప్రభాస్‌), విశ్వనాథ్ కూతురు నందిని(కాజల్‌). చిన్నప్పుడే ప్రభ, నందిని స్నేహితులుగా మారిపోతారు. విశ్వనాథ్‌ స్విట్జర్లాండ్‌ వెళ్లిపోవడంతో ప్రభ, నందినల మధ్య దూరం పెరుగుతుంది. తను ప్రాణంగా ప్రేమించిన నందినిని కలుసుకోవాలని ప్రభ ఎదురు చూస్తుంటాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఇరు కుటుంబాలు ఒక చోట కలుసుకుంటాయి. మరి విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలిని కలుసుకొన్న ప్రభ ప్రేమను వ్యక్తం చేశాడా లేదా అనేది మిగిలిన కథ. చిత్రంలో శ్రద్ధా దాస్‌, చంద్రమోహన్‌, ఎం.ఎస్.నారాయణ, ముఖేష్‌ రిషి తదితరులు నటించారు. ఈ చిత్రంలోని పలు పాటలు ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటున్నాయి. 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని