close
Published : 07/04/2021 01:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పుష్ప’రాజ్‌ డబ్బింగ్‌ షురూ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పుష్ప’ చిత్రం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా డబ్బింగ్‌ కూడా షురూ అయింది. ఈ మేరకు చిత్రబృందం మంగళవారం డబ్బింగ్‌ కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టింది. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. బన్నీ సరసన రష్మిక సందడి చేయనుంది. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని