‘ఛలో’దర్శకుడితో వైష్ణవ్ తేజ్? - vaishnav tej with chalo director
close
Published : 04/05/2021 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఛలో’దర్శకుడితో వైష్ణవ్ తేజ్?

ఇంటర్నెట్‌ డెస్క్: తొలి సినిమా ‘ఉప్పెన’తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ కథానాయకుడు వైష్ణవ్‌ తేజ్‌. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి కథానాయికగా విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడిగా నటించారు. తాజాగా వైష్ణవ్‌ తేజ్‌ - వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్త వినిపిస్తోంది. వైష్ణవ్‌కి కథ నచ్చడంతో వెంకీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ తెరకెక్కించనున్నారని చెప్పుకుంటున్నారు. ఇది వైష్ణకి నాలుగో చిత్రం అవుతోంది. సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక చేయనున్నారట. వైష్ణవ్‌ ఇప్పటికే ఇక క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రకుల్‌ కథానాయికగా ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రంలో నటించారు. తమిళ దర్శకుడు గీరీషయ్యతోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఇక వెంకీ కుడుముల గత ఏడాది నితిన్‌ నటించిన ‘భీష్మ’ చిత్రానికి దర్శకత్వం విజయాన్ని అందుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని