ఇంటర్నెట్ డెస్క్: కృష్ణవంశీ సినిమాలంటే భారీ తారాగణంతో పాటు కథ కూడా వైవిధ్యంగా ఉంటుందని పేరు. మహిళా ప్రాధాన్యం ఉన్న కథతో ఆయన ఓ చిత్రం చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం. ఇందులో కథానాయికగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్‌ని ఎంపిక చేయనున్నానారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. లాక్డౌన్ సమయంలో ఓ కథను సిద్ధం చేసుకున్నారట, దానికి సంబంధించిన స్ర్కిప్టు కూడా సిద్ధమైందని సమాచారం. జాన్వీ కపూర్ నటించిన ‘గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్’ చూసిన తరువాత కృష్ణవంశీ రాసుకున్న కథకు జాన్వీ అయితేనే సరిపోతుందని భావించారట.
ఇప్పటికే జాన్వీ తండ్రి బోనీకపూర్‌తో చర్చలు కూడా జరిపారట. కానీ, అటువైటు నుంచి రావాల్సిన స్పందన కోసం వేచి చూస్తున్నారట. బోనీ నిర్మాతగా హిందీలో కృష్ణవంశీ దర్శకత్వంలో ‘శక్తి: ది పవర్’ అనే చిత్రం రూపొందించారు. ఈ విధంగా చూస్తే జాన్వీ కపూర్‌ని తెలుగు తెరకు పరిచయం చేసే అదృష్టం వంశీకే దక్కనుంది. ప్రస్తుతం ఆయన ‘రంగ మార్తాండ’ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’, ‘రూహి’, ‘దోస్తానా2’లాంటి చిత్రాలతో బిజీగా ఉంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘జాతిరత్నాలు’ ట్రైలర్: కడుపుబ్బా నవ్వాల్సిందే!
-
ప్రేమ కథలు పక్కనెట్టి.. యాక్షన్ బాట పట్టి
-
‘లవ్ లైఫ్’ పకోడీ లాంటిది!
-
తీసేవాడుంటే ప్రతివాడి బతుకు బయోపిక్కే..!
-
‘సైనా’ రాకెట్‌తో పరిణీతి!
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- పవన్..నేనూ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాం!
-
మర్డర్ మిస్టరీల్లో ‘క్లైమాక్స్’ ఓ ప్రయోగం!
కొత్త పాట గురూ
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని